Jigarthanda Double x Clint Eastwood :కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తాజాగా తెరకెక్కించిన 'జిగర్తండ డబుల్ ఎక్స్' (Jigarthanda Double X) దీపావళీకి రిలీజై మంచి విజయం సాధించింది. కార్తిక్ మేకింగ్ స్కిల్స్, సినిమాటోగ్రఫీ మూవీని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అయితే దర్శకుడు కార్తిక్, హాలీవుడ్ డైరెక్టర్, నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్‌కు వీరాభిమాని. దీంతో సినిమాలో కొన్ని సీన్స్ ఆయనకు ట్రిబ్యూట్ ఇచ్చేలా పెట్టాడట.
అయితే సినిమా చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్లో క్లింట్ను ట్యాగ్ చేస్తూ 'డియర్ క్లింట్ ఈస్ట్‌వుడ్, భారతీయులమైన మేము జిగర్తండ అనే తమిళ సినిమా రూపొందించాం. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో మేము కొన్ని సీన్స్‌ను మీకు ట్రిబ్యూట్ ఇచ్చాము. అలాగే మీ యంగ్ ఏజ్‌ను గుర్తుచేసేలా కొన్ని యానిమేటెడ్ సీన్స్ జోడించాము. ప్లీజ్ మీకు టైమ్ దొరికినప్పుడు చూడండి' అని రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ క్లింట్ దాకా చేరుకోవడం వల్ల దీనికి పాజిటివ్ రిప్లై వచ్చింది.
'హాయ్, క్లింట్కు జిగర్తండ డబుల్ ఎక్స్ సినిమా గురించి తెలుసు. ఆయన ప్రస్తుతం జ్యురర్ -2 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ నుంచి ఫ్రీ అయ్యాక ఆయన తప్పకుండా సినిమా చూస్తారు. థాంక్యూ' అని క్లింట్ టీమ్ నుంచి రిప్లై వచ్చింది. ఆస్కార్ విన్నర్, తన ఫెవరెట్ నటుడు క్లింట్ టీమ్ నుంచి రిప్లై రావడం పట్ల కార్తిక్ సుబ్బరాజ్, నటుడు రాఘవ లారెన్స్ సంతోషం వ్యక్త పరిచారు.