ఎన్టీఆర్30 సినిమాలో హీరోయిన్గా అవకాశం రావడంపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఎన్టీఆర్30 సినిమాలో నటించనున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందంటూ బాలీవుడ్‌భామ జాన్వీ కపూర్ చెప్పారు. సినిమా ఎప్పడు ప్రారంభమవుతుందా అని ఆశాగా ఎదురుచూస్తున్నా అని జాన్వీ అన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నటిగా తన జీవితంలో మర్చిపోలేనని తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది జాన్వీ. జూ.ఎన్టీఆర్‌తో నటించేందుకు తను చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఆయనతో కలిసి నటించడం అనేది తన కల అని చెప్పింది జాన్వీ.
ఇక ఈ బాలీవుడ్ భామ ఎన్టీఆర్30 సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అరంగేట్రం చేయనున్నారు. కొరటాల శివ, జూ.ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా గనుక హిట్ అయితే జాన్వీకి సినిమా ఆఫర్లు క్యూ కట్టనున్నాయి. తాజాగా ఈమె తన 26 ఏటలోకి అడుగు పెట్టారు. మార్చి 6న తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్30 కి సంబంధించి ఫస్ట్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు జాన్వీ. ఇక ఈ పోస్టర్లో జాన్వీ కూల్ లుక్‌లో ఓ నదిఒడ్డున కూర్చొని ఉన్నట్లుగా కనిపిస్తున్న పోజ్ అందరిని ఆకట్టుకుంటోంది. అంతేగాక చీరకట్టులో వదులు జుట్టుతో వెనక్కి తిరిగి చూస్తున్న జాన్వీ స్టిల్ మతిపోయే విధంగా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ పొగుడ్తున్నారు.