తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తెలుగు హీరోయిన్స్​పై జీవిత రాజశేఖర్ కామెంట్స్​.. క్షమాపణలు చెప్పిన హరీశ్​ శంకర్​! - జీవిత రాజశేఖర్​ హరీశ్ శంకర్​

చిత్రపరిశ్రమలో ఉన్న తెలుగు అమ్మాయిలపై దర్శకుడు హరీశ్ శంకర్​, నటి దర్శకురాలు జీవిత రాజశేఖర్ కామెంట్స్​ చేశారు. ఏం అన్నారంటే?

Jeevitha rajasekhar requests to harish shankar
తెలుగు హీరోయిన్స్​పై జీవిత రాజశేఖర్ కామెంట్స్​.. క్షమాపణలు చెప్పిన హరీశ్​ శంకర్​

By

Published : Dec 8, 2022, 9:20 AM IST

చిత్ర పరిశ్రమలో చాలామంది తెలుగు అమ్మాయిలు ఉన్నారని వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని నటి దర్శకురాలు జీవిత రాజశేఖర్‌ అన్నారు. ఈ విషయమై దర్శకుడు హరీశ్‌ శంకర్‌కు విజ్ఞప్తి చేశారు. పంచతంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్​లో ఆమె మాట్లాడుతూ ఇలా చెప్పారు. తన తనయ శివాత్మిక, స్వాతి, దివ్య శ్రీపాద, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకకు హరీశ్‌, జీవిత అతిథులుగా హాజరయ్యారు.

జీవిత మాట్లాడుతూ.. "నా చిత్ర బృందం నా కుటుంబంలాంటిది. ఐదు కథల సంకలనంగా రూపొందిన ఈ సినిమా అందరికీ కనెక్ట్‌ అవుతుంది" అని అన్నారు. వేడుకకు విచ్చేసినందుకు హరీశ్‌ శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ చిత్రంలో ఐదుగురు తెలుగు అమ్మాయిలు నటించారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని (నవ్వుతూ..) హరీశ్‌ను కోరారు. దీనిపై హరీశ్‌ స్పందిస్తూ.. "ఓ రచయితగా నేను తెలుగు వారినే ఎంపిక చేసేందుకు ఇష్టపడతా. అప్పుడప్పుడు నేను ఫస్ట్‌ టేక్‌, రెండో టేక్‌కు సంభాషణ మారుస్తుంటా. అలా చేస్తే ముంబయి నుంచి వచ్చిన వారు ప్రాక్టీస్‌ అయ్యేందుకు సమయం కావాలంటారు. అందుకే సెట్‌లో మొత్తం తెలుగు వారు ఉండాలనుకుంటా. కానీ, కొన్ని పరిస్థితుల వల్ల మనవారికి న్యాయం చేయలేకపోతున్నా. ఆ విషయంలో నన్ను క్షమించాలి" అని హరీశ్‌ అన్నారు.

'గద్దలకొండ గణేశ్‌' సినిమాలో తెలుగు అమ్మాయి అయిన డింపుల్‌ హయాతీకి ఓ పాటలో అవకాశం ఇచ్చానని, ఆమెకు ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. 'పంచతంత్రం' పెద్ద కంటెంట్‌ ఉన్న సినిమా అని, టైటిల్‌ పెట్టడంలోనే దర్శకుడు హర్ష సగం విజయం సాధించారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'వాళ్లకంటే నేనే గొప్ప నటిని.. కొత్తలో బ్లాక్‌ క్యాట్‌, డస్కీ అనేవారు'

ABOUT THE AUTHOR

...view details