Jayabachchan Shooting Problems: రాజ్యసభ ఎంపీ, ఒకప్పటి నటి జయా బచ్చన్ ఏదైనా విషయం మీద తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతారు. ఈ మధ్యే తన మనవరాలు నవ్య నవేలి నందాస్ పోడ్‌కాస్ట్ ఎపిసోడ్‌కు జయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. "అవుట్‌డోర్ షూటింగ్ వెళ్లినప్పుడు పొదల మాటున శానిటరీ ప్యాడ్లు మార్చుకునే వాళ్లమని, అప్పట్లో టాయిలెట్లు ఉండేవి కావు" అని తాను సినిమాల్లోకి వచ్చిన మొదటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు.
'పొదల మాటున శానిటరీ ప్యాడ్లు మార్చుకునేవాళ్లం'.. కష్టాలు గుర్తుచేసుకున్న జయ - జయాబచ్చన్ షూటింగ్ ప్రాబ్లమ్స్
ఒకప్పటి నటి జయా బచ్చన్ తాను సినిమాల్లోకి వచ్చిన మొదటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లినప్పుడు పొదల మాటున శానిటరీ ప్యాడ్లు మార్చుకునేవాళ్లమని తెలిపారు.
"అప్పట్లో నటీనటుల కోసం కారవాన్ లాంటి వ్యానిటీ వ్యాన్స్ ఉండేవి కావు. దాంతో నెలసరి టైంలో అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లినప్పుడు పొదల మాటున శానిటరీ ప్యాడ్లు మార్చుకునేవాళ్లం. వాటిని ఒక ప్లాస్టిక్ బ్యాగులో వేసుకొని, ఇంటికి వచ్చాక చెత్తడబ్బాలో పడేసేవాళ్లం. దాంతో, అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లినప్పుడల్లా చాలా ఇబ్బందిగా అనిపించేది" అని జయా బచ్చన్ షాకింగ్ విషయాలు చెప్పారు. ఉద్యోగం చేసే మహిళలకు రెండు మూడు రోజులు నెలసరి సెలవులు ఇవ్వాలని, మగవాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
15 ఏళ్లకే సినిమాల్లోకి
పదిహేనేళ్ల వయసులోనే సత్యజిత్‌రే తీసిన 'మహానగర్'తో సినిమాల్లోకి జయ అడుగుపెట్టారు. బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించారు. బిగ్‌బీ అమితాబ్‌తో కొన్ని సినిమాలు కూడా చేశారు. ఆయనను జయ 1973లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2004 నుంచి ఇప్పటివరకూ జయ ఎంపీగా కొనసాగుతున్నారు.