తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Jawan Worldwide Collection Day 1 : 'జవాన్' సునామీలోనూ 'ఆదిపురుష్' టాప్.. ప్రభాస్ స్టార్​డమ్​ అంటే అట్లుంటది! - ఆదిపురుష్ సినిమా విడుదల తేదీ

Jawan Worldwide Collection Day 1 : బాలీవుడ్​ స్టార్ షారుక్​ ఖాన్ కొత్త చిత్రం 'జవాన్'.. గురువారం విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు సుమారు రూ. 130 కోట్లు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హిందీలో డే 1 కలెక్షన్లలో జవాన్​ టాప్​లో నిలిచింది.

Jawan Worldwide Collection Day 1
Jawan Worldwide Collection Day 1

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 6:10 PM IST

Updated : Sep 8, 2023, 6:55 PM IST

Jawan Worldwide Collection Day 1 : ఎక్కడ చూసినా ప్రస్తుతం 'జవాన్' మేనియా నడుస్తోంది. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా బ్లాక్​బస్టర్ టాక్ అందుకుంది. దీంతో ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. 'జవాన్'.. మొదటి రోజు దేశవ్యాప్తంగా.. రూ. 75 కోట్లు వసూల్ చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్​లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా జవాన్ రికార్డులకెక్కింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్​ డే 'జవాన్'.. సుమారు రూ. 130 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిందీలో ఓపెనింగ్ డే కలెక్షన్లలో టాప్​లో నిలిచిన జవాన్.. ఓవరాల్​గా ఐదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో దర్శకధీరుడు తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా.. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 223.5 కోట్లతో ఆగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో 'బాహుబలి ది కంక్లూజన్' రూ. 214.5 కోట్లతో, 'కేజీఎఫ్-2' రూ.164.5 కోట్లతో మూడో ప్లేస్​లో ఉంది.

Adipurush Day 1 Collection Worldwide :అయితే ఈ లిస్ట్​లో.. రెబల్ స్టార్ ప్రభాస్-ఓం రౌత్ కాంబినేషన్​లో వచ్చిన 'ఆదిపురుష్' రూ. 136.5 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సినిమా ఫస్ట్​ షో నుంచే మిక్స్​డ్​ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ రేంజ్ కలెక్షన్లు రావడంలో మాత్రం హీరో ప్రభాస్​ స్టార్​డమ్​ ముఖ్య కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జవాన్ మొదటి నుంచే హైప్ క్రియేట్ చేస్తూ.. హిట్​ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ.. 'ఆదిపురుష్' డే 1 కలెక్షన్లను 'జవాన్' అధిగమించలేకపోయింది.

ఇక ఆదిపురుష్సినిమాలో ప్రభాస్​కు జంటగా కృతిసనన్ నటించారు. ఈ సినిమాను రామాయణ ఇతిహాసం ఆధారంగా డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్.. రావణుడి పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న గ్రాండ్​గా విడుదలైంది. రిలీజ్ తర్వాత ఈ సినిమా అనేక వివాదాలను ఎదుర్కొంది. అయినప్పటికీ విడుదలైన 10 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 450 కోట్ల వసూల్ చేసింది.

'ఆదిపురుష్' @340 కోట్లు.. రాముడిగా ప్రభాస్​ను అందుకే సెలెక్ట్​ చేశారా?

Jawan Day 1 Collection : కలెక్షన్లలో 'జవాన్​' దూకుడు.. ఏడాదిలో రెండు సినిమాలతో కింగ్ ఖాన్​ రికార్డు..

Last Updated : Sep 8, 2023, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details