Jawan Twitter Review : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గురువారం రిలీజైంది. సినిమా రిలీజ్‌కు ముందే థియేటర్ల వద్ద బారులు తీరిన అభిమానులు.. షారుక్ కటౌట్ల వద్ద డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. దీంతో రిలీజైన అన్ని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?
ప్రస్తుతం 'జవాన్'కు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమాలో షారుక్ మాస్ ఎంట్రీ అదిరిపోయిందని.. సినిమా యాక్షన్ ప్యాక్డ్గా ఉందని.. ఇది కచ్చితంగా హిట్ సినిమా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇక జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటూ ఇంకొకరు అభిప్రాయపడగా.. మాస్ అవతార్‌లో ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా అంటే ఎలా ఉంటుందో అలా చూపించారు అంటూ మరో అభిమాని రాసుకొచ్చారు.
Jawan Twitter Review Telugu : "జవాన్ మూవీ ఓ విన్నర్. ఈ సినిమాపై పెరిగిన అంచనాల కంటే ఎక్కువగానే ఉంది. మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ ఇచ్చారు" అంటూ దర్శకుడికి ఓ అభిమాని కితాబివ్వగా.. కింగ్ సైజ్‌డ్ ఎంటర్‌టైనర్ సినిమాను అందించారు అంటూ మరో అభిమాని అట్లీని కొనియాడారు. జవాన్ తప్పకుండా చూడండి అంటూ నెట్టింట విజ్ఞప్తి చేశారు. మరొకరేమో ఇందులో నయనతార ఎంట్రీ బాగుందని.. విజయ్ సేతుపతి నటన అద్భుతమంటూ ట్వీట్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే... మొత్తానికి 'జవాన్' అందరినీ అలరిస్తుందంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు.