Jawan Movie :కింగ్ షారుక్ ఖాన్ కొత్త సినిమా 'జవాన్'.. సెప్టెంబర్ 7 న రీలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించారు. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే
ఈ సినిమా ఎడిటింగ్ వర్క్స్‌లో 20 నిమిషాల సన్నివేశాలను డిలీట్ చేశారట. అయితే ఇప్పడు ఆ సన్నివేశాల్ని.. న్యూ వెర్షన్ పేరుతో మళ్లీ సినిమాలో కలపడానికి డైరెక్టర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సీన్స్‌లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు.. విక్రమ్ రాథోడ్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం ఓటీటీకోసమేనట. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Jawan OTT : అయితే జవాన్ ఓటీటీ రిలీజ్‌కు మాత్రం కొన్నిరోజులు వెయిట్ చేయక తప్పేలాలేదు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని సమాచారం. అంటే నవంబర్ మొదటి వారంలో 'జవాన్' ఓటీటీలోకి వావొచ్చు. ఇక షారుక్ సినిమాల్లో.. డిలీట్ చేసిన సీన్స్‌ను యాడ్ చేయడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో రిలీజైన 'పఠాన్' సినిమాలో కూడా సన్నివేశాలు కలిపారు. అయితే ఆ సినిమాలో కేవలం 4 నిమిషాల సీన్స్ కలిపితే.. 'జవాన్'లో ఏకంగా 20 నిమిషాల సన్నివేశాలను జోడించనున్నారట.