తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Jawan Google Animation : యానిమేషన్​తో గూగుల్ సర్​ప్రైజ్.. ఆ రికార్డు బద్దలుకొట్టారంటూ..'జవాన్​' పై మహేశ్ బాబు ట్వీట్ - jawan release date

Jawan Google Animation : బాలీవుడ్ స్టార్ హీరో షారుక్​ ఖాన్ కొత్త చిత్రం జవాన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గురువారం రిలీజై.. సూపర్ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. ప్రస్తుతం జవాన్ మూవీయునిట్ ఈ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సంబరాల్లో గూగుల్​ కూడా భాగమైంది. ప్రస్తుతం ఓ సర్​ప్రైజ్​తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Jawan Google Animation
Jawan Google Animation

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 3:47 PM IST

Jawan Google Animation :బాలీవుడ్​ బాద్​షా షారుక్​ఖాన్​-కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'జవాన్'. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. హిట్​ టాక్​ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం ప్రస్తుతం జవాన్ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ సంబరాల్లో గూగుల్ కూడా పాలుపంచుకుంటోంది.

ఈ సెలెబ్రేషన్స్​లో భాగంగా జవాన్కోసం గూగుల్.. కొత్తగా ఓ యానిమేషన్​ను రెడీ చేసింది. 'JAWAN' అని గూగుల్​లో సెర్చ్​ చేస్తే.. స్క్రీన్​పై ఓ వాకీటాకీ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేస్తే.. రెడీ అంటూ సినిమాలో హీరో షారుక్ చెప్పిన డైలాగ్ ప్లే అవుతుంది. అంతేకాకుండా సినిమాలో​ బ్యాండెజ్​లతో కనిపించే షారుక్ లుక్​ను గుర్తుచేస్తూ.. బ్రౌజ్​ పేజ్​ అంతా బ్యాండెజ్​లతో నిండిపోతుంది. గూగుల్ క్రియేట్ చేసిన ఈ యానిమేషన్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Mahesh Babu Tweet On Jawan: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తాజాగా జవాన్ సినిమాను ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. " జవాన్ బ్లాక్​బస్టర్ సినిమా.. డైరెక్టర్ అట్లీ.. కింగ్ సైజ్ ఎంటర్​టైన్​మెంట్ ఇచ్చాడు. ఇది తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్. ఇక షారుక్​ స్క్రీన్ ప్రజెన్స్​, ఆయన చరిష్మా ఎవరూ మ్యాచ్​ చేయలేరు. జవాన్ సినిమాతో తన రికార్డులు తానే బద్దలుకొట్టుతున్నారు. తను ఓ లెజెండ్" అని ట్వీట్​ చేశారు. సినిమా రిలీజ్​కు ముందు కూడా మహేశ్.. జవాన్​పై ట్వీట్ చేశారు. అప్పుడు ఆయన.. డైరెక్టర్ అట్లీ, హీరో షారుక్​కు ఆల్​ ది బెస్ట్ చెప్పారు. అయితే ఈ ట్వీట్​కు షారుక్.. థాంక్యూ మై ఫ్రెండ్ అని రిప్లై ఇచ్చారు.

Jawan First Day Collection :సినిమా విషయానికొస్తే.. ముందుగా పెరిగిన అంచనాలను జవాన్ అందుకుందనే చెప్పాలి. ఇదే ఏడాది జనవరిలో రిలీజైన షారుక్ పఠాన్ సినిమాకు తొలిరోజు రూ. 57 కోట్ల కలెక్షన్లు రాగా.. తాజాగా జవాన్​ఓపెనింగ్ డే రూ. 75 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఒకే ఏడాదిలో రిలీజైన రెండు సినిమాలకు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైక హీరోగా నిలిచారు షారుక్.

Jawan Cast : ఈ సినిమాలో షారుక్​కు జోడీగా తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా.. సీనియర్ నటి ప్రియమణి , సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.

Jawan Day 1 Collection : కలెక్షన్లలో 'జవాన్​' దూకుడు.. ఏడాదిలో రెండు సినిమాలతో కింగ్ ఖాన్​ రికార్డు..

Jawan Advance Booking : అడ్వాన్స్ బుకింగ్స్​లో 'జవాన్'​ జోరు.. 'పఠాన్' రికార్డ్స్ బ్రేక్​!

ABOUT THE AUTHOR

...view details