తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Jawan Day 4 Collection : భారత్-పాక్ మ్యాచ్​ రోజూ తగ్గని 'జవాన్' వసూళ్లు.. నాలుగు రోజుల్లో రూ.500కోట్లు - jawan worldwide collection in india

Jawan Day 4 Collection : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన చిత్రం జవాన్. సెప్టెంబర్ 7న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే రూ.500కోట్లు వసూలు చేసింది.

Jawan Day 4 Collection
Jawan Day 4 Collection

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 10:04 AM IST

Updated : Sep 11, 2023, 3:34 PM IST

Jawan Day 4 Collection :బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్​.. 'జవాన్'​ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతున్నారు. తొలి రోజు నుంచే హిట్​ టాక్ రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. తొలి రోజు దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ. 75 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డే 1 రికార్డు.. నాలుగో రోజు బద్దలైంది.

ఆదివారం ఈ జవాన్ దేశవ్యాప్తంగా.. రూ.81 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఒక 4వ రోజే దాదాపు 28.75 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జవాన్ రూ.287 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 520.79 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మూవీటీమ్​ అధికారికంగా మూవీటీమ్ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 'జవాన్​' రోజు వారి కలెక్షన్లు.

  • 1వ రోజు రూ. 75 కోట్లు
  • 2వ రోజు రూ. 53.23 కోట్లు
  • 3వ రోజు రూ. 77.83 కోట్లు
  • 4వ రోజు రూ. 81 కోట్లు

Miss Shetty Mr Polishetty Collection: నవీన్ పొలిశెట్టి-అనుష్కశెట్టి జంటగా నటింటిన చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి. పి. మహేశ్ బాబు ఈ సినిమాను తెరకెక్కించారు. గురువారం విడుదలైన ఈ సినిమా.. తొలి రోజు షారుక్ జవాన్ (తెలుగు వెర్షన్) కు గట్టి పోటీనే ఇచ్చింది. దాదాపు రూ. 4 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఇప్పటికీ దాదాపు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో రన్ అవుతోంది. ఇక నాలుగో రోజైన ఆదివారం సుమారు రూ. 3.25 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు రూ. 11.03 కోట్ల కలెక్షన్లు సాధించింది.

Miss Shetty Mr Polishetty OTT : ఇక సినిమా విషయానికొస్తే.. ఎప్పటిలాగే నవీన్ తన కామెడీ టైమింగ్​తో ఆడియెన్స్​ను మెప్పించారట. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. దాదాపు 5 ఏళ్ల తర్వాత బిగ్​ స్ర్కీన్​పై కనిపించడం వల్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ డైరెక్టర్ మహేశ్ బాబు చక్కగా చూపించారట. ఇక సినిమాలో నాజర్‌, మురళీ శర్మ, జయసుధ, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అయితే వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రావచ్చని తెలుస్తోంది.

Miss Shetty Mr Polishetty Movie: 'మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి'లో బాలకృష్ణ.. ఆ సీన్స్​కు థియేటర్లో ఫ్యాన్స్​ రచ్చ రచ్చ!

Sharukh Khan Jawan Movie Collections : రొటీన్ కమర్షియల్​తోనే రూ.1000 కోట్లు.. ఇక షారుక్​ నెక్స్ట్​ టార్గెట్​ అదే!

Last Updated : Sep 11, 2023, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details