Jawan Day 1 Collection :బాలీవుడ్ బాద్షాషారుక్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ.. ఆ అంచనాలు దాటి దూసుకెళ్తోంది. దీంతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక తొలి రోజు ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూలు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'జవాన్' తొలి రోజు ఇండియాలో రూ.75 కోట్ల సంపాదించింది. హిందీ వెర్షన్లో ఈ చిత్రం దాదాపు రూ. 65 కోట్ల రూపాయలను వసూలు చేయగా.. మిగిలిన మొత్తం డబ్బింగ్ వెర్షన్ల నుంచి వచ్చిందే.ఈ వసూలు రికార్డుతో ఆయన 'పఠాన్' రికార్డులనే అధిగమించారు.
Sharukh Khan Jawan Movie Collection : 'పఠాన్' తొలి రోజు రూ.57 కోట్లు సంపాదించగా.. 'జవాన్' మాత్రం రూ. 75 కోట్లు వసూలు చేసి టాప్కు చేరుకుంది. ఈ క్రమంలో షారుక్ మరో రికార్డును అందుకున్నారు. ఒకే ఏడాదిలో రిలీజైన రెండు సినిమాలకు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైక ఇండియన్ స్టార్‌గా చరిత్రకెక్కాడు. ఆయన నటించిన రెండు సినిమాలు ఇలా ఒకదానికి మించి ఒకటి రికార్డు స్థాయిలో వసూలు సాధించడం పట్ల షారుక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట 'జవాన్' సినిమాను ట్రెండ్ చేస్తున్నారు.