Jawan Atlee Film : రీసెంట్గా రిలీజైన షారుక్ జవాన్.. బాక్సాఫీస్ ముందు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. దీంతో ఈ మూవీటీమ్.. సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా అట్లీ మాట్లాడుతూ.. తనకు కింగ్ ఖాన్ షారుక్ అంటే ఎంత ఇష్టమో చెప్పారు. అలాగే తనపై నమ్మకంతో షారుక్ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని పేర్కొన్నారు. అలాగే తన సినిమాలు వరుస విజయాలను అందుకోవడం గురించి కూడా చెప్పారు.
Atlee Shahrukh Jawan Budget : "కరోనా సమయంలో షారుక్ ఖాన్‌కు జవాన్ కథ చెప్పాను. ఆ సమయంలో అసలు కొన్నేళ్ల పాటు థియేటర్లకు ఆడియెన్స్ వస్తారా అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో నన్ను నమ్మి రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారా అని సందేహపడ్డాను. ఎందుకంటే ఒక నిర్మాతగా నాకు ఆ ఆలోచనలు బాగా తెలుసు. కానీ, అలాంటి సమయంలో షారుక్ నాపై ఎంతో నమ్మకంతో ఉంచారు. రూ.300 కోట్లు పెట్టేందుకు ఒకే అన్నారు. సినిమా పూర్తయే సరికి ఆ బడ్జెట్ మరింత పెరిగిపోయింది. అయినా ఆయన మాత్రం ఎక్కడా అస్సలు రాజీపడలేదు. ప్రేక్షకులు మాకు ఓ భారీ బ్లాక్‌బస్టర్ స్టేటస్‌ను అందించారు. ఈ సినిమా నేను షారుక్‌కు రాసిన ప్రేమలేఖగా భావిస్తాను" అని పేర్కొన్నారు.