Jawan Advance Booking : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా రానున్న తాజా పాన్ ఇండియా మూవీ జవాన్. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా.. మరో రోజులో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. పఠాన్ లాంటి రూ.1000కోట్ల భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత షారుక్ నుంచి రానున్న సినిమా ఇది. దీంతో జవాన్‌పై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ రేంజ్లో జరుగుతున్నాయి. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరబాద్, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో భారీ ప్రీ సేల్స్ బుకింగ్స్‌ను జరుపుకుంటోందీ చిత్రం. ఈ మూవీ జోరు చూస్తుంటే.. ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేలానే కనిపిస్తుంది.
అప్పుడే ప్రపంచబాక్సాఫీస్ ముందు రిలీజ్ కాకముందే హాఫ్ సెంచరీ కొట్టేసింది. మొదటి రోజు అడ్వాన్స్ సేల్స్ ఇండియా వైడ్‌గా రూ.32.47కోట్లను అందుకుంది. ఓవర్సీస్లో రూ.18.70 కోట్లు అందుకున్నట్లు తెలిసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.51.17కోట్లు. సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశముంది. అంతకుముందు షారుక్ పఠాన్ ఓపెనింగ్ అడ్వాన్స్ బుకింగ్ ఇండియాలో రూ.32కోట్లు జరిగింది.