Jawan 11th Day Collection Worldwide Box Office : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్స్ జోరు అస్సలు ఆగట్లేదు. ఈ చిత్రం మొదటి వారంలో రూ. 368.38 కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది. 8వ రోజు రూ. 21.6 కోట్లు, 9వ రోజు రూ. 19.10 కోట్లు, 10వ రోజు రూ. 31.80 నెట్ కలెక్షన్స్ అందుకుంది. ఇక ఆదివారం(సెప్టెంబర్ 17) వీకెండ్ కావడంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్గా రూ. 36.52 కోట్ల నెట్, రూ. 70 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ఈ చిత్రం 11 రోజుల్లో కలిపి వరల్డ్ వైడ్గా రూ.477.28 కోట్లు నెట్, రూ. 840 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ను అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వేగంగా రూ. 800 కోట్లు గ్రాస్ అందుకున్న ఏకైక హిందీ చిత్రంగా రికార్డుకెక్కింది.
Jawaan Overseas Collections : ఇక షారుక్ ఖాన్‌కు ఓవర్సీస్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. జవాన్ చిత్రం అక్కడ కూడా కళ్లు చెదిరే వసూళ్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తూ ఖాతాలో వేసుకుంటుంది. 11 రోజుల్లో మొత్తంగా 34 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 282.52 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది.