తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Jawaan Trailer : 'జవాన్' ట్రైలర్​ వచ్చేసిందోచ్​.. పవర్​ఫుల్​ యాక్షన్ అండ్​ ఫన్నీ​ సీన్స్​తో​.. - Jawaan Cast And Crew

Jawaan Trailer : తమిళ దర్శకుడు అట్లీ.. బాలీవుడ్ బాద్​ షా షారుక్ కాంబోలో తెరకెక్కిన 'జవాన్' సినిమా ట్రైలర్​ రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ ప్రచార చిత్రం చూస్తంటే గూస్​ బంప్స్​ వస్తున్నాయి. మీరు చూసేయండి..

Jawaan Trailer
జవాన్ ట్రైలర్​ రిలీజ్

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 12:15 PM IST

Updated : Aug 31, 2023, 1:04 PM IST

Jawaan Trailer : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ బాద్​ షా షారుక్ 'జవాన్' రిలీజ్​ డేట్ దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్స్​లో ఫుల్​ జోరుగా ఉన్న మూవీటీమ్​ రోజుకో సర్​ప్రైజ్ చేస్తూనే ఉంది. తాజాగా 2:45 నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్​ చేసింది మూవీటీమ్​. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం... షారుక్​ ఖాన్ నుంచి అభిమానులు ఆశించే యాక్షన్, రొమాన్స్, కామెడీ.. అన్నీ అంశాలు కనిపిస్తున్నాయి.

'అనగనగా ఒక రాజు.. ఒకదాని తర్వాత ఇంకోటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు' అంటూ ట్రైలర్‌ను మొదలుపెట్టారు. 'దాహంతో, ఆకలితో అడవిలో తిరుగుతున్నాడు. ఓటమితో అతను చాలా కోపంగా ఉన్నాడు' అంటూ కాస్త ఎమోషనల్‌గా ట్రైలర్‌లో కథ చెప్పడం ప్రారంభించి.. ఆ తర్వాత ముంబయిలో హైజాక్ ఘటన దేశం మొత్తం సంచలనం రేపింది.. అంటూ కథను సీరియస్‌గా మార్చేశారు.

'నీకు ఏం కావాలో చెప్పు అంటే'.. 'ఆలియా భట్ కావాలి' అంటూ షారుక్ అనడం, 'ఏంటమ్మా గోనే సంచిని హెల్మెట్‌లా పెట్టుకొన్నాడు'... 'అందరూ అతడికి ఫ్యాన్స్ అయిపోయారు మేడమ్'​.. అంటూ డైలాగ్స్ ఫన్నీగా, క్రేజీగా సాగాయి.

'మన దగ్గర ఒకే ఒక్క క్లూ ఉంది. ఆరుగురు అమ్మాయిలు'.. అంటూ దీపికా పదుకొణె, నయనతార, ప్రియమణిని చూపించారు. ఈ క్రమంలోనే 'ఓడిపోతావు' అని దీపిక పదుకోన్ అనగా 'నిన్ను చూసినప్పుడే ఓడిపోయాను'.. అంటూ షారుక్‌ చెప్పడం వంటి యాక్షన్ అండ్ కామెడీ ఎపిసోడ్స్​ను చూపించారు. ఈ క్రమంలోనే షారుక్​.. నయనతారో రొమాన్స్​, దీపికతో యాక్షన్ చేయడం వంటి సన్నివేశాలను చూపించారు.

విజయ్ సేతుపతి మార్క్ విలనిజం.. విజయ్ సేతుపతి విలన్​ పాత్రను కూడా రివీల్ చేశారు. విజయ్ సేతుపతిని ఆర్మ్ డీలర్​గా చూపించారు. అంటే ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తిగా. తన స్వార్థం కోసం దేశ ప్రత్యర్థులకు ఆయన ఆయుధాలను అక్రమంగా విక్రయించే వ్యక్తిగా పవర్​ఫుల్​గా చూపించారు. 'నేను విలనై నీ ముందుకు వచ్చాను.. అని షారుక్ అనగా.. విలన్.. మై నేజ్ ఈజ్ కాళీ సార్.. ఇంత కష్టపడి నా ప్రాణం కన్నా ఎక్కువగా నిర్మించుకొన్న సామ్రాజ్యం మీద ఏవడైనా చేయి వేస్తే.. అంటూ విజయ్ సేతుపతి మార్క్ విలనిజాన్ని చూపించారు. మొత్తంగా విజయ్ అక్రమంగా విక్రయించే ​ఆయుధాల వల్ల ఎటువంటి నష్టం చేకూరింది? అతడిని పట్టుకోవడం కోసం షారుఖ్​ ఏం చేశారు? అనేది ఈ కథ అని అర్థమవుతోంది.

షారుక్ హీరోయిజం డైలాగ్స్​.. మేము జవాన్లం.. మా ప్రాణాలను ఒక్కసారి కాదు.. వెయ్యి సార్లైనా పోగొట్టుకుంటాం. అదీ దేశం కోసమే.. కానీ మీలాంటి వాళ్లు దేశాన్ని అమ్ముకుంటూ పోతే.. మీ లాభాల కోసం మా ప్రాణాలను త్యాగం చేయం.. అంటూ షారుక్ చెప్పిన డైలాగ్స్​ షారుక్ క్యారెక్టర్‌లోని హీరోయిజాన్ని, ఎమోషన్స్​ను బాగా చూపించాయి.

షారుక్​ డ్యుయెల్​ రోల్.. 'నా కోడుకు మీద చేయి వేసే ముందు.. వాడి బాబు మీద చేయి వెయ్యి..' అంటూ ట్రైలర్​ చివర్లో షారుక్​ సవాల్ విసరడంతో సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్​తో చూపించారు. ఈ డైలాగ్​తో షారుక్​ డ్యుయెల్​ రోల్​ చేస్తున్నారని స్పష్టత వచ్చింది. తండ్రీకొడుకులుగా షారుక్​ కనిపించనున్నారు. అయితే ఈ ప్రచార చిత్రం నాలుగు ఐదు గెటప్స్​లో షారుక్ కనిపించారు. లుక్స్ పరంగా వేరియేషన్స్ బాగానే చూపించారు.

షూటింగ్​లో షారుక్​కు ప్రమాదం.. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే?

వామ్మో.. సల్మాన్​, షారుక్​ బాడీగార్డుల​ శాలరీ అంతా?.. భారీగానే ఇస్తున్నారుగా!

Last Updated : Aug 31, 2023, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details