తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ నటితో పెళ్లి.. కానీ జాన్వీతో కలిసి జిమ్​లో కేఎల్​ రాహుల్ అలా! - కేఎల్ రాహుల్​ లేటెస్ట్ వీడియో

టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ కేఎల్ రాహుల్​, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్​కు సంబంధించిన ఓ వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. ఆ వీడియోను చూసేయండి..

Janvikapoor KL Rahul jim video viral
ఆ నటితో పెళ్లి.. కానీ జాన్వీతో కలిసి జిమ్​లో కేఎల్​ రాహుల్ అలా!

By

Published : Nov 29, 2022, 2:19 PM IST

టీమ్​ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ త్వరలోనే తన ప్రియురాలు బాలీవుడ్ నటి అతియా శెట్టిని వివాహం చేసుకోనున్నాడు. జనవరిలో వీరి వివాహ వేడుక జరగనుంది. పెళ్లికి ముందే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న రాహుల్.. ప్రస్తుతం జిమ్‌‌లో చెమటలు చిందిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశాడు.

అయితే నెటిజన్లు ఆ వీడియోలో హీరోయిన్​ జాన్వీకపూర్​ నడుచుకుంటూ వెళ్లడం గమనించారు. ఆమె కూడా ప్రస్తుతం కొత్త పాత్ర కోసం తన శరీర ఆకృతిని తీర్చిదిద్దుకోవడానికి శ్రమిస్తోంది. సాధారణంగా ఇది కొత్తేమీ కాదు కానీ.. నెటిజన్లు మాత్రం ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

కాగా, వచ్చే ఏడాది ఆరంభంలో రాహుల్, అతియా శెట్టి వివాహం జరగనుంది. ఇప్పటికీ ఇంకా పెళ్లి తేదీని ఖరారు చేయలేదు. ఇక గాయం నుంచి కోలుకొని ఆసియా, టీ20 వరల్డ్ కప్‌లలో ఆడిన కేఎల్ రాహుల్.. ఈ రెండు టోర్నీలలోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్, జింబాబ్వేలపై మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించిన అతడు.. పెద్ద జట్లపై విఫలమయ్యాడు. పవర్ ప్లేలోనూ దూకుడు ఆడి వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. దీంతో అతడి ఆటతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. మరి పెళ్లికి ముందు బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో రాహుల్ ఎలా ఆడుతాడో చూడాలి.ఇకపోతే జాన్వీ విషయానికొస్తే.. ఇటీవలే మిలీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ బవాల్​, మిస్టర్​ అండ్​ మిసెస్​ మహీ చిత్రంలో నటిస్తోంది.

ఇదీ చూడండి:రష్యా భాషలో 'పుష్ప' ట్రైలర్​ చూశారా.. తగ్గేదే లే

ABOUT THE AUTHOR

...view details