తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మాజీ బాయ్​ఫ్రెండ్​ నుంచి మెసేజ్​.. తెగ సంతోషపడిపోయిన జాన్వీ! - జాన్వీ కపూర్​ ఇషాన్ ఖట్టర్ సినిమా

తన మాజీ బాయ్​ఫ్రెండ్​ గురించి స్పందించారు హీరోయిన్​ జాన్వీ కపూర్​. ఏమన్నారంటే.

Janvi kapoor boyfriend
మాజీ బాయ్​ఫ్రెండ్​ నుంచి మెసేజ్

By

Published : Nov 4, 2022, 3:28 PM IST

Updated : Nov 4, 2022, 7:25 PM IST

'ధడక్‌'తో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి జాన్వీకపూర్‌. ఆ సినిమా హీరో ఇషాన్‌ కట్టర్‌తో ఆమె ప్రేమలో ఉన్నారనీ.. ఆ తర్వాత కొన్ని కారణాలతో వీరిద్దరూ విడిపోయారని గతంలో వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఇషాన్‌ గురించి జాన్వి స్పందించారు. 'మిలీ' ప్రమోషన్స్‌లో ఇషాన్‌ గురించి విలేకర్లు ప్రశ్నించగా.. అతడు తనకి మంచి స్నేహితుడని అన్నారు.''మా ఇద్దరి కెరీర్‌ ఒకేసారి మొదలైంది. మేమిద్దరం మంచి స్నేహితులం. 'మిలీ' రిలీజ్‌కు అభినందనలు చెబుతూ ఇటీవల తను మెసేజ్‌ పంపించాడు. నాకెంతో ఆనందంగా అనిపించింది. అతడు నటించిన 'ఫోన్‌బూత్‌' మంచి విజయాన్ని అందుకోవాలని రిప్లై ఇచ్చాను'' అని ఆమె తెలిపారు.

అనంతరం 'ఫోన్‌బూత్‌'పై స్పందిస్తూ.. సినిమా ట్రైలర్‌ తనకెంతో నచ్చిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంతకం పెట్టడానికి ముందే ఇషాన్‌ తనకు ఈ కథ గురించి చెప్పాడని, తాను కూడా ఈ సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇదీ చూడండి:జాన్వీ బేబీ నీ గ్లామర్​ ట్రీట్​కు కాస్త గ్యాప్​ ఇవ్వమ్మా కుర్రాళ్లకు నిద్ర ఉండట్లే

Last Updated : Nov 4, 2022, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details