తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అప్పుడు చిరు-శ్రీదేవి.. ఇప్పుడు ​చరణ్​-జాన్వీ!.. 'RC16'లో హీరోయిన్​ ఆమేనా? - రామ్​చరణ్ జాన్వీ కపూర్​

మెగాస్టార్​ చిరంజీవి- అతిలోక సుందరి శ్రీదేవి జోడీ అప్పట్లో అదుర్స్​. ఇప్పుడు వారి పిల్లలు రామ్​చరణ్​​- జాన్వీ కపూర్​ ఒకే ఫ్రేమ్​లో కనిపించబోతున్నారు!. చెర్రీ 16వ సినిమాలో జాన్వీ హీరోయిన్​గా నటించనున్నారని తెలిసింది.

janvi kapoor ramcharan
janvi kapoor ramcharan

By

Published : Nov 30, 2022, 12:19 PM IST

Ramcharan Janhvi Kapoor: మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో త్వరలోనే భారీ బడ్జెట్​తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. చరణ్​కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే హైదరాబాద్​ వచ్చిన జాన్వీ కూడా తాను తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం తన టాలీవుడ్ తొలి సినిమాకు రామ్​చరణ్ మూవీ అయితే బాగుంటుందని అతిలోక సుందరి ముద్దుల కుమార్తె భావిస్తోందట. ఈ సినిమా నటించేందుకు ప్రయత్నిస్తోందట. అన్నీ ఓకే అయితే వచ్చే ఏడాది సినిమా షూటింగ్​ ప్రారంభం కానుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాకు సంతకం చేస్తే, దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

జాన్వీ కపూర్ తల్లి, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరు కలిసి నటించిన పలు సినిమా చక్కటి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు వారి పిల్లలు రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం రామ్​చరణ్​.. శంకర్‌ దర్శకత్వంలో 'RC 15' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ న్యూజిలాండ్​లో జరుగుతోంది. హీరోయిన్​గా కియారా నటిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాటను తాజాగా చిత్రీకరించారు. అయితే ఆ పాట విజువల్స్​ అద్భుతంగా వచ్చాయంటూ ​చరణ్​ ట్వీట్​ చేశారు. అందుకు సహకరించిన చిత్రబృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్​ స్పాట్​లోని కొన్ని ఫొటోలను పంచుకున్నారు.

రామ్​చరణ్​ షేర్​ చేసిన ఫొటో

ABOUT THE AUTHOR

...view details