Jailer Villain Arrest :సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన'జైలర్' చిత్రంలో విలన్ ప్రముఖ మలయాలీ నటుడు వినాయకన్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్‌నార్త్ పోలీస్‌స్టేషన్‌లో మద్యంమత్తులో ఆయన గొడవకు దిగడం వల్ల అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. తమను వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారట. దీంతో వినాయకన్‌ను పోలీసులు స్టేషన్‌ను పిలిపించారు.
ఈ క్రమంలో మద్యం మత్తుతో ఉన్న వినాయకన్ సహనం కోల్పోయి గొడవకు దిగినట్లు తెలిసింది. అతడిని వారించేందుకు పోలీసులు యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడం వల్ల కేసు నమోదు చేసి అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వినాయకన్(jailer villain arrested) అరెస్ట్ అవ్వడం తొలిసారి కాదనీ ఓ మోడల్‌ను వేధించిన కారణంగా గతంలోనూ అరెస్ట్ అయ్యారని.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయినట్లు వార్తలొచ్చాయి. జైలర్ సినిమా విడుదలైన సమయంలో ఈ కథనాలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి.
బెయిల్‌పై విడుదల..వినాయకన్ అరెస్ట్‌పై అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాపచంద్రన్ స్పందించారు. పోలీస్ స్టేషన్లో గొడవ సృష్టించినందుకు వినాయకన్‌పై కేసు నమోదు చేశాం. ఆ తర్వాత బెయిల్‌పై రిలీజ్ చేశాం. స్టేషన్లో ఓ పోలీస్ అధికారితో అతడు దురుసుగా ప్రవర్తించాడు." అని పేర్కొన్నారు.