తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Jailer OTT Release : ఓటీటీ రిలీజ్​కు 'జైలర్' రెడీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్​.. ఎక్కడంటే ? - జైలర్​ ఓటీటీ రిలీజ్​

Jailer OTT Release : సూపర్​ స్టార్​ రజనీకాంత్​ నటించిన లేటెస్ట్ సూపర్​ హిట్ మూవీ జైలర్​ త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటి వరకు బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా.. ఏ వేదికగా ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ కానుందంటే?

Jailer OTT Release
జైలర్​ ఓటీటీ రిలీజ్​

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 12:11 PM IST

Updated : Sep 2, 2023, 1:28 PM IST

Jailer OTT Release : థియేటర్లలో విడుదలై బ్లాక్​ బస్టర్​గా దూసుకెళ్తున్న 'జైలర్​' మూవీ.. త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్​ ప్రైమ్​ వేదికగా సెప్టెంబర్​ 7న విడుదల చేయనున్నట్లు ఆ సంస్ధ ప్రకటించింది. దీంతో తలైవర్​ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

Rajinikanth Jailer Cast :తమిళ దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోయాక్షన్​, సెంటిమెంట్​, కామెడీ ఇలా అన్ని అంశాలను ఎంతో చక్కగా ఆయన చూపించారు. ఇందులో సూపర్​ స్టార్​ రజనీకాంత్​ సరసన సీనియర్ హీరోయిన్​ రమ్యకృష్ణ మెరవగా.. మిల్క్​ బ్యూటీ తమన్న ఓ కీలక పాత్ర పోషించారు. ఇక రజనీకాంత్​ కూడా తన మార్క్​ స్టైల్​తో ప్రేక్షకులకు వింటేజ్​ రజనీని గుర్తుచేశారు. మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్​ రవిచందర్​ ఈ సినిమాకు మ్యూజిక్​ అందించగా​.. ఇప్పుడు ఆ పాటలు మ్యూజిక్​ లవర్స్​ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు సైతం ఈ సినిమాలో తమ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్​ హీరో శివ రాజ్‌కుమార్ ఇతర ముఖ్యపాత్రలో మెరిసి సినిమాకు హైలైట్​గా నిలిచారు.

Rajnikanth Jailer Box Office Record :ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'జైలర్'​ సినిమా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్​ క్రియేట్​ చేస్తోంది. రిలీజైన అన్ని థియేటర్లలోనూ కాసుల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో కోలీవుడ్​లో అత్యధిక కలెక్షన్లు (రూ. 600 కోట్లకుపైగా) వసూలు చేసిన రెండో సినిమాగా రికార్డుకెక్కింది. అయితే ఈ లిస్ట్​లో రూ.665 కోట్లతో రోబో 2.O(Robot 2.0) మొదటి స్థానంలో ఉంది. ఈ రెండు సినిమాలు రజనీయే కావడం విశేషం. ఇక వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో 'పొన్నియిన్‌సెల్వన్‌-1' (రూ.492 కోట్ల కలెక్షన్​), నాలుగో స్థానంలో విశ్వనటుడు కమల్​హాసన్​ 'విక్రమ్‌' (రూ.432 కోట్ల కలెక్షన్​) ఉన్నాయి.

Jailer Producer Gifted Car To Director : హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్‌కు ఖరీదైన కార్ గిఫ్ట్!

Thalaivar 170 Update : 'జైలర్' సక్సెస్​ సెలబ్రేషన్స్​లో రజనీ.. 'జై భీమ్'​ దర్శకుడితో సినిమా షురూ!

Last Updated : Sep 2, 2023, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details