Jailer OTT Release :సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీఆగస్టు 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ టాక్‌ను సంపాదించుకుంది. రిలీజైన రోజు నుంచే కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ఈ చిత్రం తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్‌లో విడుదలై తన జోరును కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి జైలర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీల్లో టాప్ ట్రెండింగ్ సినిమాగా దూసుకెళ్తోంది. అయితే థియేటర్లలోకి వచ్చి నెలకూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చి ఈ సినిమా ఇలా సెన్సేషన్ క్రియేట్ చేయడం కూడా ఓ అరుదైన విషయమే.
Jailer OTT Release : 'జైలర్'.. ఓటీటీలోనూ తగ్గేదే లే.. ట్రెండింగ్ లిస్ట్‌లో ఇదే టాప్! - Jailer Movie
Jailer OTT Release : సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం 'జైలర్'. థియేటర్లలలో విడుదలై నెల కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా.. ఇక్కడ కూడా తన జోరును కొనసాగిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఆ విశేషాలు మీ కోసం..
Published : Sep 8, 2023, 12:05 PM IST
Jailer Movie Cast :సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. ఇందులో రజినీ టైటిల్ రోల్ పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, మిల్కీ బ్యూటీ తమన్నా, నటులు మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌లు కీలక పాత్రల్లో అలరించారు. ఇక ఈ మూవీని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇక 73 ఏళ్ల రజినీకాంత్ ఎప్పటిలాగే తన స్టైలిష్ లుక్స్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్‌తో మరోసారి అభిమానులకు కిక్ ఎక్కించారు. అంతేకాకుండా ఆకట్టుకునే విధంగా రూపొందించిన థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.
Jailer Cinema Worldwide Collections :ఇక గత కొంతకాలంగా రజినీకాంత్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు దాదాపు 7 ఏళ్ల తర్వాత 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా జైలర్‌తో మంచి జోష్ అందించారు తలైవా. ఈ సినిమా కేవలం తమిళనాటే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్‌ను నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమాల కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.44.75 కోట్ల షేర్, రూ.91.10 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్‌తో ఔరా అనిపించింది.
- ఓటీటీ లవర్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో రూ.650 కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ
- Jailer OTT Release : ఓటీటీ రిలీజ్‌కు 'జైలర్' రెడీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్.. ఎక్కడంటే ?
- This Week Releasing Movies : థియేటర్లో హై ఓల్టేజ్ 'జవాన్'.. ఓటీటీలో 'జైలర్' రిలీజ్.. మీ ప్లాన్స్ ఏంటి?
- September OTT Movies : ఓటీటీలో వీకెండ్ మజా.. 2 సినిమాలు, 16 వెబ్‌సిరీస్‌లు.. ఆ రెండిటిపై స్పెషల్ ఫోకస్..