తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Jailer Ott Release Date : 'జైలర్' ఓటీటీ కోసం రజనీ ఫ్యాన్స్ నిరీక్షణ.. రిలీజ్ అయ్యేది అప్పుడే! - రోబో 2 0 కలెక్షన్లు

Jailer Ott Release Date : సూపర్​ స్టార్​ రజనీకాంత్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'జైలర్' సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూల్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్​ ఎప్పుడని ఫ్యాన్స్​ ఇంటర్నెట్​లో తెగ వెతికేస్తున్నారు. మరి 'జైలర్' ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉండనుందంటే..

Jailer Ott Release Date
Jailer Ott Release Date

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 8:59 PM IST

Jailer Ott Release Date : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్లీడ్ రోల్​లో తెరకెక్కిన చిత్రం 'జైలర్'. దర్శకుడు నెల్సన్ దిలీప్​కుమార్.. ఈ సినిమాను యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్​లో తెరకెక్కించారు. ఆగస్టు 10న విడుదలైన 'జైలర్'.. ఇప్పటికీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో కోలీవుడ్​లో అత్యధిక కలెక్షన్లు (రూ. 600 కోట్లకుపైగా) వసూల్​ చేసిన రెండో సినిమాగా నిలిచింది. అయితే ఈ లిస్ట్​లో రూ.665 కోట్లతో రోబో 2.O(Robot 2.0) మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ రెండు సినిమాలు రజనీయే కావడం విశేషం.

ఇక వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో 'పొన్నియిన్‌సెల్వన్‌-1' (రూ.492 కోట్ల కలెక్షన్​), నాలుగో స్థానంలో విశ్వనటుడు కమల్​హాసన్​ 'విక్రమ్‌' (రూ.432 కోట్ల కలెక్షన్​) ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్​ ఎప్పుడంటూ.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు దంచేస్తున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రానుందంటే.

'జైలర్' మూవీ రిలీజై గురువారానికి 20 రోజులు అవుతోంది. కానీ ఇప్పటివరకూ ఈ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Pictures)​.. ఓటీటీ విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికీ రిలీజ్​ డేట్​పై కానీ.. స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్​పై కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. ముందుగా అనుకున్న సమయం కంటే ఇంకొంచెం లేట్​గా ఓటీటీలో స్ట్రీమింగ్​ అవుతుందని మూవీమేకర్స్ ఇదివరకే తెలిపారు. అయితే ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో జోరు ప్రదర్శిస్తున్నందున.. చిత్ర నిర్మాణ సంస్థ ఓటీటీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ఈ సినిమా కలెక్షన్ల పరంగా నెం.1లో ఉన్న రోబో 2.O ను సమీపిస్తోంది. త్వరలోనే 2.O వసూళ్లను జైలర్ అధిగమించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ డేట్​ అనౌన్స్​ చేస్తే కలెక్షన్లపై ప్రభావం పడవచ్చని నిర్మాణ సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) రూ. వంద కోట్లకు సినిమా హక్కులు కొనుగోలు చేసినట్లు ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఓటీటీ వేదిక కానీ, సన్​ పిక్చర్స్​ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ, ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత డేట్​ ప్రకటించే ఛాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది.

Rajinikanth Yogi Feet : యోగి కాళ్లు మొక్కడంపై రజనీ రియాక్షన్​​.. అందుకే అలా చేశానంటూ..

Jailer Hukum Spotify : రజనీ ఖాతాలో మరో రికార్డు.. 'స్పాటిఫై'లో నెం.1గా నిలిచిన 'హుకుమ్' ​​.. సౌత్​లో ఇదే ఫస్ట్ సాంగ్​

ABOUT THE AUTHOR

...view details