తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Jailer Movie : 'జైలర్​', 'విక్రమ్'​ స్టోరీలైన్​ ఒక్కటేనా?.. ఆ హాలీవుడ్​ మూవీకి కాపీనా? - విక్రమ్​ మూవీతో రజనీకాంత్​ జైలర్​ పోలిక

Jailer Movie Trailer : తమిళ సూపర్​ స్టార్​ రజనీ కాంత్ నటింస్తున్న​జైలర్​ మూవీ ట్రైలర్​కు నెట్టింట మంచి రెస్పాన్స్​ వస్తోంది. అయితే ట్రైలర్​ చూసిన అభిమానులు ఈ సినిమాను రెండు భారీ సినిమాలతో పోలుస్తున్నారు. అవేంటంటే?

Jailer Movie Trailer
Jailer Movie Trailer

By

Published : Aug 3, 2023, 1:31 PM IST

Rajnikant Jailer Trailer : తమిళ సూపర్​ స్టార్​ రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్' సినిమాలో నటిస్తున్నారు. 'బీస్ట్​' దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేసింది మూవీ టీమ్​. 'జైలర్​ షో కేస్' అంటూ బుధవారం విడుదలైన ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరలవుతోంది. దీంతో అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే 'జైలర్' ట్రైలర్ చూస్తే.. రజనీ ఫుల్​ యాక్షన్​ ప్యాకేజీలా ఉంది. ఓ వైపు అమాయకంగా కనిపిస్తూనే మరో వైపు శత్రువులను మట్టుకరిపించే వీరుడిగానూ కనిపిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్​ వీక్షించిన కొంతమంది నెటిజన్లు సినిమా స్టోరీ లైన్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో ఇది హాలీవుడ్​ సినిమా కాపీలా ఉందని కామెంట్లు పెడుతుండగా.. మరికొందరేమో ఇది లోకేశ్​ కనగరాజ్​ తెరకెక్కించిన 'విక్రమ్'​లా ఉందంటూ నెట్టింట గుసగుసలాడుతున్నారు. ఓ సారి రెండు కథలను పరిశీలిస్తే..

విక్రమ్​ స్టోరీలైన్​ లానే..
2022లో తమిళ దర్శకుడు తెరకెక్కించిన బ్లాక్​ బస్టర్​ మూవీ 'విక్రమ్​'. కమల్ హాసన్, ఫాహద్​ ఫాజిల్​, విజయ్​ సేతుపతి లాంటి స్టార్స్​ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో కమల్​ ఓ రిటైర్డ్ ఏజెంట్. ఆయన కుమారుడిని ఓ డ్రగ్​ మాఫియా హతమారుస్తుంది. ఇక తన మనవడి కోసమే బతుకుతున్న ఆయన ఎవ్వరికీ తెలియకుండా తన కో ఏజెంట్స్​తో కలిసి డ్రగ్​ మాఫియాను మట్టికరిపిస్తాడు. అలాగే తన కుమారుడిని చంపిన వాళ్లపై పగ తీర్చుకుంటాడు. ఇప్పుడు జైలర్ కథ కూడా ఇంచు మించు అలానే అనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు.

ఇందులో కూడా ఓ డ్రగ్ మాఫియా కేసును ఛేదిస్తున్న సమయంలో పోలీస్​ ఆఫీసర్​ అయిన రజనీ కొడుకు అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. దీంతో తన కుమారుడి జాడ కోసం వెతుకుతున్న రజనీ.. తనకున్న జైలర్‌ అనుభవంతో కుమారుడికి ఏమైందో తెలుసుకోవడమే కాకుండా.. ఆ మాఫియా ముఠాను అంతమొందిస్తాడు. ఇదంతా కేవలం ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. దీంతో ఈ స్టోరీ చూసిన ఫ్యాన్స్​.. 'విక్రమ్' సినిమాతో పోలుస్తున్నారు. కానీ 'విక్రమ్​'ను లోకేశ్​ సీరియస్​ మోడ్​లో తీసుకెళ్తే.. 'జైలర్​'లో మాత్రం యాక్షన్​తో పాటు కామెడీని నింపారు దర్శకుడు నెల్సన్​.

ఆ హాలీవుడ్​ సినిమాలా..
మరోవైపు ఈ సినిమా ఏదో హాలీవుడ్​ సినిమా కాపీ వెర్షన్​లా ఉందంటా కామెంట్లు పెడుతున్నారు. ట్రైలర్‌లో చూపించిన ప్రకారం.. సినిమా మొదట్లో అమాయకుడిలా కనిపించే హీరో.. కాసేపటి తర్వాత ఎవరూ ఊహించని రీతిలో మారిపోయి కనిపిస్తాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనను ఆటపట్టిస్తుంటారు. అయితే హీరో బయటకు కనిపిస్తున్నది వేరు.. అతడి గతం వేరు అనే విషయం ఆ తర్వాత తెలుస్తుంది. ఇక హీరో యాక్షన్​ మోడ్​లోకి వెళ్లాక ఏం జరగుతుందన్న విషయమే మిగతా స్టోరీ.

2021లో విడుదలై మంచి టాక్​ అందుకున్న హాలీవుడ్ మూవీ 'నోబడీ'తో రజనీ 'జైలర్' సినిమాను పోలుస్తున్నారు. ఇందులోనూ ఓ వ్యక్తి.. అనుకోని పరిస్థితుల్లో రష్యన్ మాఫియాతో పోరాడుతాడు. తనని 'నోబడీ' అనుకున్న వారికి తన యాక్షన్​ రూపాన్ని చూపించి షాక్​కు గురిచేస్తాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో జైలర్​ను పోలుస్తూ అభిమానులు నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఏ విషయాన్ని సినిమా విడుదలయ్యేంత వరకు తేల్చి చెప్పలేమని మరికొందరు అంటున్నారు. అసలు విషయం తెలుసుకునేందుకు ఆగస్ట్​ 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details