తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వివాదంలో రజినీ 'జైలర్'.. పేరు మార్చాలంటూ కోర్టుకెక్కిన దర్శకుడు! - jailer malayalam movie release date

Jailer Movie Title Issue : సూపర్​ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'జైలర్' సినిమాకు కొత్త చిక్కు వచ్చి పడింది. అదేంటంటే!

Jailer Movie Title Issue
జైలర్ టైటిల్​పై వివాదం

By

Published : Jul 16, 2023, 9:57 PM IST

Jailer Movie Title Issue : సూపర్​ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్​సినిమా టైటిల్ తమదేనంటూ.. మలయాళ దర్శకుడు సక్కిర్‌ మడథిల్‌ కోర్టును ఆశ్రయించారు. వెంటనే టైటిల్ మార్చుకోవాలని సక్కిర్‌.. సన్​ పిక్చర్స్ నిర్మాణ సంస్థను డిమాండ్ చేశారు. ఈ వివాదంపై త్వరలోనే కోర్టు హియరింగ్ ఉన్నట్లు సమాచారం. కాగా రజనీకాంత్ సినిమా రిలీజ్​కు ముందు ఇలాంటి లీగల్ సమస్యల్లో చిక్కుకోవడం వల్ల అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది.

అయితే మలయాల డైరెక్టర్ సక్కిర్‌ మడథిల్‌.. 2021 ఆగస్టులో కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌లో తాము 'జైలర్' టైటిల్​ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిపారు. ఆ టైటిల్ ఖరారయ్యాక అదే ఏడాది నవంబరు 6 నుంచి షూటింగ్ ప్రారంభించారని.. తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యాయన్నారు. దుబాయ్ షార్జాలో గతేడాది జూన్‌ 26న ఓ ఈవెంట్​లో టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేసినట్లు దర్శకుడు సక్కిర్ తెలిపారు.

ఆ ఈవెంట్​కు కమల్‌హాసన్‌, మంజు వారియర్‌లు కూడా హాజరయ్యారని గుర్తుచేశారు. అయితే వారి కంటే పది రోజుల ముందు.. రజనీకాంత్‌కథానాయకుడిగా సన్‌ పిక్చర్స్‌ 'జైలర్'​ను ప్రకటించిందని సక్కిర్ వాపోయారు. కాగా రజనీకాంత్ 'జైలర్' కేరళలో కూడా విడుదల కానుంది. అందువల్ల ఆ ఒక్క రాష్ట్రంలోనైనా వారి సినిమా టైటిల్​ను మార్చాలని.. సన్ పిక్చర్స్​ సంస్థను ఆయన సంప్రదించినప్పటికీ వారు దానికి అంగీకరించలేదని దర్శకుడు సక్కిర్ తెలిపారు.

అయితే రెండు సినిమా కథల నేపథ్యం వేరైనప్పటికీ.. టైటిల్ ఒకటే అవ్వడం వల్ల ప్రేక్షకులు సందిగ్ధతకు గురవుతారని.. అది సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని సక్కిర్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు, సన్‌ పిక్చర్స్‌ సంస్థ తమ సినిమాకు మార్కెట్ పరంగా ఎలాంటి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో.. వారు కూడా కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

కాగా ధ్యాన్‌ శ్రీనివాసన్‌ హీరోగా.. సక్కిర్‌ దర్శకత్వం వహించిన మలయాళ సినిమాను ఎన్‌. కె. మహమ్మద్‌ నిర్మించారు. ఈ చిత్రం పీరియాడికల్ జోనర్​లో ఉండనుంది. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడీగా తమన్నా నటిస్తోంది. మోహన్‌లాల్‌ , శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 10న విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details