తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'జైలర్‌' రిలీజ్‌.. చెన్నై, బెంగళూరు ఆఫీస్​లకు హాలీడే.. ఫ్రీగా టికెట్లు.. ఇది కదా రజనీ క్రేజ్‌ అంటే! - జైలర్​ మూవీ రిలీజ్​

Jailer Movie Holiday : సూపర్​ స్టార్​ రజనీకాంత్​ నటించిన 'జైలర్'​ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో చెన్నై, బెంగళూరులోని అనేక ఆఫీసులకు ఆగస్టు 10న సెలవు ప్రకటించారు. యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ.. ఉద్యోగులకు సెలవు ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా మూవీ టికెట్లు కూడా ఇస్తుందట.

Jailer Movie Holiday
Jailer Movie Holiday

By

Published : Aug 7, 2023, 2:05 PM IST

Jailer Movie Holiday : సూపర్‌ స్టార్‌.. ఈ పేరు తెరపై కనిపిస్తే చాలు ఈలలతో థియేటర్‌లు దద్దరిల్లిపోతుంటాయి. ఆయన సినిమా విడుదలవుతుందంటే తమిళ నాట పెద్ద పండగే. రజనీకాంత్​.. స్క్రీన్‌ మీద కనబడితే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తమిళ సినిమా గురించి దేశం నలుమూలల మాట్లాడుకునేలా చేసిన ఘనత ఆయనది. ఆయన ఫ్లాపు సినిమాలు సైతం కొందరి హీరోల బ్లాక్‌బస్టర్‌ సినిమాల రేంజ్‌లో కలెక్షన్‌లు సాధిస్తుంటాయి. తలైవాకు తమిళనాట ఫ్యాన్స్‌ కాదు భక్తులుంటారు. ఆయన సినిమా రిలీజవుతుందంటే చాలా మంది హిట్టవ్వాలని పూజలు కూడా చేయిస్తుంటారని ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం. అంతలా ఆయన్ని అభిమానిస్తుంటారు.

చెన్నై, బెంగళూరులో అన్ని ఆఫీసులకు సెలవు!
Jailer Movie Holiday Offices : ప్రస్తుతం రజనీకాంత్​ నటించిన జైలర్‌ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రజనీకి ఈ సినిమా బంపర్ హిట్టవుతుందని అందరూ ధీమాగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ ఆగస్టు 10న హాలీడే ప్రకటించింది. అంతేకాదు అందులో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉచితంగా మూవీ టిక్కెట్‌లు ఇవ్వనుందట. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించబోతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ కంపెనీతో పాటు వివిధ కంపెనీలు.. చెన్నై, బెంగళూరులో ఉన్న ఆఫీసులకు సెలవు ప్రకటించాయట.

'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి'
Jailer Movie Cast : నెల్సన్‌ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు.. భారీ అంచనాలు నెలకొల్పాయి. రీసెంట్​గా తమన్నా చిందులేసిన 'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి' అంటూ వచ్చిన సాంగ్​ సోషల్​మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఈ పాటకు అనిరుధ్‌ స్వరాలు అందించగా, సింధూజ శ్రీనివాసన్‌ దీనిని ఆలపించారు. సన్​ పిక్చర్స్​ సినిమాను నిర్మిస్తోంది.

Rajnikanth kamalhassan : రజనీ.. కమల్​ రేంజ్​లో సక్సెస్​ను అందుకుంటారా?

Upcoming Telugu Movies : మెగాస్టార్ X సూపర్​స్టార్​.. ఈ వారం కొత్త సినిమాల రిలీజ్​ లిస్ట్​ ఇదే!

ABOUT THE AUTHOR

...view details