Jailer Movie Expected Collection : సూపర్‌స్టార్ రజనీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'జైలర్'. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ గురువారం గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దేశవ్యాప్తంగా పలు థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే అభిమానుల సందడి మొదలైంది. డ్యాన్స్‌లు, బాణాసంచాల మోతలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. రజనీకి ఇది కమ్‌బ్యాక్ మూవీ అంటూ తలైవర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Jailer Movie Collections : ఇండియాతో పాటు ఓవర్సీస్లోనూ రజనీ మూవీస్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో 'జైలర్'కు భారీగానే అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యిందట. ఈ నేపథ్యంలో మొదటి రోజు కలెక్షన్స్ కూడా ఓ రేంజ్లో రానున్నాయని టాక్. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు టిక్కెట్లు కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోయాయట. నైజాంలో 185 థియేటర్స్, సీడెడ్ 85 థియేటర్స్, ఆంధ్రలో 230 థియేటర్స్ లో 'జైలర్' గ్రాండ్‌గా రిలీజైంది.
Rajnikanth Jailer Telugu Collections :మరోవైపు తమిళనాడు, కర్ణాటకలోనూ 'జైలర్' మేనియా మొదలైంది. తమిళనాడులో రూ.8 కోట్ల రేంజ్ ప్రీ బుకింగ్స్ జరగ్గా.. కర్ణాటకలో సుమారు రూ.7 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్లకు బుకింగ్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం. ఇక దేశం మొత్తంలో ఈ సినిమాకు బుకింగ్స్ దాదాపు రూ.17 కోట్లకు పైగా బుకింగ్స్ జరిగిందని తెలుస్తోంది. ఓవర్సీస్ బుకింగ్స్‌తో కలిపి 'జైలర్' మొత్తంగా రూ.30 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్‌ను సొంతం చెసుకున్నట్లు సమాచారం. రజినీ సినిమాల్లో రోబో 2.0 తర్వాత బెస్ట్ బుకింగ్స్‌తో 'జైలర్' ముందంజలో ఉంది.