Jailer Hukum Spotify :తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన సినిమా 'జైలర్'. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ కథకు, అనిరుధ్ సంగీతం తోడవడం వల్ల థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇప్పటికే అనేక రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ సినిమా.. తాజాగా మరో ఘనత సాధించింది. అదేంటంటే.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. ఎప్పటిలాగే ఈ సినిమాలో తన సంగీతం మార్క్‌ను చూపించారు. ఒక్కో సీన్లో అనిరుధ్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో థియేటర్లలో ఆడియెన్స్‌కు గూస్బంప్స్ తెప్పించారు. అయితే సినిమాలోని 'హుకుమ్' పాట రీసెంట్గా ఓ అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ పోడ్కాస్ట్ 'స్పాటిఫై'లో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణ భారతంలో ఈ మైలురాయి అందుకున్న ఏకైక పాట ఇదేనంటూ 'జైలర్' నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్విట్టర్లో తెలిపింది.
Rajinikanth Meets Yogi Adityanath : సూపర్ స్టార్ రజనీ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లారు. అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి.. శనివారం లఖ్‌నవూలో 'జైలర్' స్పెషల్ షో వీక్షించనున్నారు. అంతకుముందు రజనీ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్ర గవర్నర్ ఆనందీ బెన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఆదివారం రజనీకాంత్ అయోధ్య వెళ్లనున్నారు.