Jailer Director Nelson Abou Nandamuri Balakrishna : రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్.. టాలీవుడ్ దిగ్గజ కథానాయకుడు నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విజయం సాధించిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నెల్సన్ కొన్ని విశేషాలు పంచుకున్నారు. జైలర్ చిత్రంలోని ఓ పాత్ర నందమూరి బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నానని.. కానీ అది సాధ్యపడలేదు అని తెలిపారు.
'తెరపై రజనీకాంత్ సర్ ఒక్కరు కనిపిస్తేనే జోష్ వస్తుంది. అందుకే ఈ సినిమాని మల్టీస్టారర్‌గా తీయాలనుకోలేదు. స్పెషల్ అట్రాక్షన్ కోసమే మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌లను ఎంపిక చేశాను. వీరు నటించడం వల్ల 'జైలర్' మల్టీస్టారర్ అనే ఊహాగానాలు వచ్చాయి. ఇందులోని ఓ పోలీసు పాత్ర కోసం తెలుగు హీరో బాలకృష్ణను అనుకున్నా. కానీ, కథానుగుణంగా ఆ క్యారెక్టర్‌ను సరిగా డిజైన్ చేయలేకపోయా. అలాంటప్పుడు ఆయన్ను ఎంపిక చేయడం సరైంది కాదనిపించింది. అందుకే ఆయన్ను అసలు సంప్రదించలేదు. నటించేందుకు ఆయన అంగీకరించేవారో, లేదో తర్వాతి సంగతి. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేస్తానేమో' అని నెల్సన్ అన్నారు. ఒకవేళ ఈ సినిమాలో బాలకృష్ణ కూడా భాగమై ఉండి ఉంటే మరో రేంజ్‌లో ఉండేదనే చర్చ ఇప్పటికే నెట్టింట మొదలైంది.
Rajinikanth Balakrishna : రజనీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' చిత్రం హిట్‌టాక్‌తో దూసుకెళ్తోంది. ఆయన యాక్షన్, స్టైల్‌కు ప్రేక్షకలోకం ఫిదా అవుతోంది. యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా నటించారు. జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, యోగిబాబు, వసంత్ రవి, మిర్నా మేనన్ కీలక పాత్రలు పోషించారు. తెరపై రజనీకాంత్ కనిపించి దాదాపు రెండేళ్లుకావడంతో ఆయన అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం వారి అంచనాలు అందుకుంది.