తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Jailer Day 3 Collection : మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్​.. థియేటర్లలో 'జైలర్​' బొమ్మ బ్లాక్​బస్టర్​.. - జైలర్​ మూవీ కేమియో

Jailer Day 3 Collection : సూపర్​ స్టార్​ రజినీకాంత్- నెల్సన్​ దిలీప్​ కుమార్ కాంబోలో వచ్చిన 'జైలర్'​ సినిమా బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. గురువారం విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న ఈ మూవీ మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే ?

Jailer Day 3 Collection
జైలర్​ డే 3 కలెక్షన్స్

By

Published : Aug 13, 2023, 11:11 AM IST

Updated : Aug 13, 2023, 12:13 PM IST

Jailer Day 3 Collection : సూపర్​ స్టార్​ రజినీకాంత్​ నటించిన 'జైలర్'​ మూవీకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. రిలీజైన అన్నీ చోట్లా భారీ స్థాయిలో వసూళ్లను సంపాదిస్తూ చరిత్ర సృష్టిస్తోంది. వీకెండ్​ అయిన మూడో రోజు ఈ సినిమా రూ.35 కోట్లు సంపాదించింది. ఈ క్రమంలో మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్​లోకి చేరుకుంది. దీంతో రజనీ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

Rajinikanth Badrinath Temple Visit :ఇక ఈ సినిమా సక్సెస్​ను ఆస్వాదిస్తున్న రజనీకాంత్​ ప్రస్తుతం నార్త్​లో ఉన్నారు. 'జైలర్'​ రిలీజ్​కు ముందే హిమాలయాలకు వెళ్లిన ఆయన అక్కడున్న ఆలయాలను,ఆశ్రమాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్​కు చేరుకున్న ఆయన.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అభిమానులకు అభివాదం చేసి, వారితో కాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Rajinikanth Jailer Box Office Collection :ట్రైలర్​తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సెట్​ చేసిన 'జైలర్​'.. వాటిని ఏ మాత్రం తగ్గించకుండా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా దూసుకెళ్తోంది. తొలి రోజు నుంచే కలెక్షన్లలోనూ మంచి జోరు చూపించిన ఈ సినిమా.. తాజాగా వంద కోట్ల మార్క్​ను దాటింది.

Rajinikanth Jailer Cast :ఇక సినిమా విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'జైలర్​'ను తమిళ దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​ రూపొందించారు. యాక్షన్​, సెంటిమెంట్​,కామెడీ ఇలా అన్ని అంశాలను ఎంతో చక్కగా ఆయన చూపించారు. ఇందులో రజనీ సరసన సీనియర్ హీరోయిన్​ రమ్యకృష్ణ మెరవగా.. మిల్క్​ బ్యూటీ తమన్న ఓ కీలక పాత్ర పోషించారు.

Rajinikanth Jailer Cameos : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్​ హీరో శివ రాజ్‌కుమార్ ఇతర ముఖ్యపాత్రలో నటించి ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు. ఇక రజనీకాంత్​ కూడా తన మార్క్​ స్టైల్​తో ప్రేక్షకులకు వింటేజ్​ రజనీని గుర్తుచేశారు. యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్​ రవిచందర్​ అందించిన మ్యూజిక్​.. ఈ సినిమాకు మరో హైలైట్​గా నిలవగా..సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు సైతం తమ తమ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.

Rajnikanth Badrinath Visit : బద్రీనాథ్‌లో సూపర్​ స్టార్​ సందడి.. రజినీతో ఫొటో కోసం ఫ్యాన్స్ ఆసక్తి

Jailer Movie Telugu Review : వింటేజ్​ రజనీ ఆగయా.. 'జైలర్​' మూవీ ఎలా ఉందంటే?

Last Updated : Aug 13, 2023, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details