Jailer Box Office Collection : సూపర్ స్టార్ రజనీకాంత్ తన లేటెస్ట్ మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్' గురించే ఇప్పుడు నెట్టింట టాక్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా.. ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుండా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్నీ అంశాల కలయికగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్టయ్యారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో రజనీ నటన చూసి గూస్బంప్స్ వచ్చాయని ఫ్యాన్ అంటున్నారు.
Jailer Day 2 Collection : ఇక ఇండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ రజనీ మేనియా నడుస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు ఈ సినిమా ఇండియాలో సుమారు రూ.44.50 కోట్ల వసూళ్లను రాబట్టగా.. రెండో రోజు ఈ సినిమా రూ. 27 కోట్లు సంపాదించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అలా రెండు రోజులు కలెక్షన్లు కలిపి రూ.75.35 కోట్లకు చేరుకుంది. ఇక వీకెండ్స్‌లో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో త్వరలోనే ఈ సినిమా వంద కోట్లు క్లబ్‌కు చేరుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Jailer Movie Opening Collection : ఓ ప్రముఖ సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం 'జైలర్' సినిమా ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి తొలి రోజు సుమారు రూ. 44.50 కోట్లు నెట్ వసూలు చేసిందట. ఈ క్రమంలో తొలిరోజు ఈ సినిమా రూ.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల టాక్. అందులో తమిళనాడు నుంచి రూ.23 కోట్లు, కర్ణాటక నుంచి రూ.11 కోట్లు, కేరళ నుంచి రూ.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రూ.10 కోట్లు, ఇతర రాష్ట్రాల నుంచి రూ.3 కోట్లు వరకు వసూలు రాబట్టిందని టాక్.