Jailer Box Office Collection Day 6 : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ రిలీజైనప్పటినుంచి నిర్విరామంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇండియాలో తొలి రెండు రోజుల్లోనే రూ. 70 కోట్ల మార్క్‌కు చేరువైన ఈ సినిమా ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా వసూలు సాధించి చరిత్రకెక్కింది. అంతేకాకుండా సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 345 కోట్ల వరకు వసూలు సాధించిందట.
మంగళవారం స్వాత్రంత్య్ర దినోత్సవం రోజు సెలవు కావడం వల్ల కలెక్షన్లు ఇంకాస్త పెరిగింది. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆరో రోజు సుమారు రూ. 33 కోట్లకు మేర సంపాదించి మొత్తం ఇండియాలో రూ. 207.15 కోట్లకు మేర చేరుకుంది. ఈ అంచనాలు చూస్తుంటే ఈ సినిమా తమిళనాడులో ఇప్పటి వరకు అత్యథిక వసూలు సాధించిన పొన్నియిన్ సెల్వన్-1 రికార్డును బ్రేక్ చేసేలా ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీకెండ్స్‌తో పాటు ఇండిపెండెన్స్ డే సెలవులు ఈ సినిమాక ప్లస్ పాయింట్లుగా మారింది.
Rajinikanth Jailer Pre Release Business : ఇక'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది. తమిళనాడులో ఈ సినిమా రూ. 62 కోట్లు వసూలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 12 కోట్ల బిజినెస్ జరిగింది. మరోవైపు కేరళ రూ. 5.50 కోట్లు, కర్ణాటక రూ. 10 కోట్లు, ఇక ఇండియాలోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 3 కోట్లు కలెక్ట్ చేయగా.. ఓవర్సీస్లో ఏకంగా రూ. 30 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో వరల్డ్ వైడ్ 'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 122.50 కోట్లు జరిగాయని ట్రేడ్ వర్గాల టాక్.