Jailer And Bhola Shankar Collection : సూపర్ స్టార్ రజనీకాంత్-మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఒకరోజు గ్యాప్‌లో బాక్సాఫీస్ ముందు థియేటర్లలో ప్రేక్షకుల ముందు సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిలో జైలర్ సూపర్ రికార్డ్‌లతో దూసుకుపోతుండగా.. భోళాశంకర్ మాత్రం మరీ దారణంగా వసూళ్లను అందుకుంటోంది. ఓవర్సీస్లోనూ ఇదే కొనసాగుతోంది.
Jailer USA Collection : జైలర్ యూఎస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ చిత్రం అక్కడ తమిళ-తెలుగు వెర్షన్స్‌లో విడుదలైంది. ఓపెనింగ్ వీకెండ్లో దాదాపు 4 మిలియన్ డాలర్ల వసూళ్లను అందుకుంది. అక్కడి బాక్సాఫీస్ ముందు ఓపెనింగ్ వీకెండ్‌కు సంబంధించిన తమిళ సినిమాల్లో ఈ రేంజ్ కలెక్షన్లను అందుకున్న మూవీ 'పొన్నియిన్ సెల్వన్'. కానీ ఇప్పుడా మార్క్‌ను జైలర్ అందుకుని సెన్సేషనల్ సృష్టించింది. రజనీకి గత చిత్రాల్లో మొదటి వీకెండ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ వసూళ్లను 3.9మిలియన్ డాలర్ మార్క్‌ను 'కబాలి' మాత్రమే అందుకుని. ఇప్పుడు జైలర్ దాన్ని అధిగమించి.. రజనీ కెరీర్లోనే బెస్ట్ ఎవెర్ ఓపెనింగ్ వసూళ్లను అందుకున్న చిత్రంగా ఘనతను అందుకుంది.
అలాగే యూఎస్ బాక్సాఫీస్ ముందు ఫుల్ రన్ టైమ్‌లో తమిళ సినిమాల్లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాసింగ్ వసూళ్లను పొన్నియిన్ సెల్వన్ అందుకుంది. ఇప్పుడా రికార్డ్‌ను 'జైలర్' అధిగమించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ జైలర్ సినిమా ఆగస్ట్ 9న అంటే బుధవారం 947, 117 డాలర్లు, గురువారం 622, 352 డాలర్లు, శుక్రవారం 767,497 డాలర్లు, శనివారం 979,978డాలర్లు, ఆదివారం 690కే వరకు డాలర్లను సాధించింది. మొత్తంగా 4 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించి రికార్డును అందుకుంది.