55 Crore Advance To Director : ఓ సినిమాను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించాలంటే దాని వెనుక డైరెక్టర్ శ్రమ ఎంతో ఉంటుంది. కొందరు వేరే వాళ్లు రాసిన కథను తీస్తారు. మరకొందరు సొంత కథనే తెరకెక్కిస్తారు. వారు రాసుకున్న స్క్రిప్ట్‌ను నిర్మాతకు వినిపించి ఒప్పిస్తారు. అది వారికి నచ్చితే సినిమా తీయడానికి ఒప్పుకుని ఆ డైరెక్టర్‌కు కొంత మొత్తాన్ని అడ్వాన్స్ ఇస్తారు. తర్వాత అది సినిమాగా మన ముందుకు వస్తుంది.
ఇప్పుడున్న కాలంలో ఎంతో మంది డైరెక్టర్లు తన హిట్లతో హీరోలకు దీటుగా క్రేజ్ సంపాదిస్తున్నారు. తెలుగులో రాజమౌళి, త్రివిక్రమ్, బాలీవుడ్లో రోహిత్ శెట్టి, రాజ్ కుమార్ హిరాణీ లాంటి వాళ్లు ఇందుకు నిదర్శనం. హిట్ సినిమాలు తీసి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నారు. మరోవైపు ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో పారితోషికాలను కూడా అందుకుంటున్నారు. అయితే నిర్మాతలు ముందుగా స్క్రిప్ట్ విని ఆ తర్వాతే అడ్వాన్స్ ఇస్తారు. కానీ దక్షిణాదికి చెందిన ఓ డైరెక్టర్ మాత్రం ఎటువంటి స్టోరీ వినకుండానే నిర్మాత నుంచి రూ.55 కోట్లు అడ్వాన్స్ అందుకున్నారు. అతను మరెవరో కాదు.. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. 'జైలర్' సినిమాతో అటు రజనీకాంత్‌కు ఇటు సన్ పిక్చర్స్‌కు భారీ హిట్‌ను అందించిన ఈ స్టార్ డైరెక్టర్ ఈ భారీ మెత్తానికి అందుకుని ట్రెండింగ్‌లో ఉన్నారు.
జైలర్ సినిమా అందుకున్న విజయాన్ని చూసిన దర్శకుడు ఆ సినిమాను సీక్వెల్‌గా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. దీంతో స్క్రిప్ట్ వినకుండానే సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారు నిర్మాత కళానిథి మారన్. ఇలా కథ వినకుండా డైరెక్టర్‌కు అంత సొమ్ము ఇవ్వడానికి కారణం జైలర్ అందుకున్న సక్సెస్ అని విశ్లేషకుల అభిప్రాయం.