తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'జై బాలయ్య' సాంగ్.. రామ జోగయ్య శాస్త్రి అసహనం.. అసలేమైందో - gopichand malineni balayya

బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా కోసం తాను రాసిన 'జై బాలయ్య' సాంగ్ విడుదలైన కాసేపటికి ఓ ట్వీట్​ చేసి అసహనం వ్యక్తం చేశారు ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి. ఏం జరిగిందంటే?

Jai balayya song rama jogayya sastri tweet viral
'జై బాలయ్య' సాంగ్.. అసహనం వ్యక్తం చేసిన రామ జోగయ్య శాస్త్రి.. అసలేం జరిగిందో

By

Published : Nov 25, 2022, 4:43 PM IST

ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి అసహనం వ్యక్తం చేశారు. తనతో కానీ లేదా తనపేరుతో కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటే తనతో కలిసి ప్రయాణించాల్సిన అవసరం లేదని అన్నారు. ఏం జరిగిందంటే..

స్టార్‌ హీరోల సినిమాలకు ఎన్నో హిట్‌ పాటలు అందించిన జోగయ్య.. తాజాగా సోషల్​మీడియాలో ఓ ట్వీట్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. "ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించండి. జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీ పుత్ర రామజోగయ్యశాస్త్రిగా మార్చుకున్నాను. ఈ విషయంపై వేరే వాళ్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇటు రాకండి" అని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

రామజోగయ్య శాస్త్రి ఉన్నట్టుండి ఈ విధంగా ట్వీట్‌ పెట్టడానికి గల కారణం ఏమిటో తెలియదు. 'వీర సింహారెడ్డి' సినిమా కోసం ఆయన రాసిన 'జై బాలయ్య' పాట విడుదలైన కొంతసేపటికే ఈ ట్వీట్‌ చేశారు. ఈ సాంగ్​ విడుదలయ్యాక పలువురు సోషల్‌మీడియా యూజర్స్‌ నెగెటివ్‌గా కామెంట్స్‌ చేశారని.. అందుకే ఆయన ఈ ట్వీట్‌ పెట్టారని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. "జై బాలయ్య పాట చాలా బాగుంది. సాహిత్యంపై పట్టులేని వాళ్లు చేసే వ్యాఖ్యలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అంటూ మరికొంతమంది తమ మద్దతు తెలియజేస్తున్నారు.

ఇదీ చూడండి:ఈ చిన్నారిని గుర్తుపట్టారా ఇప్పుడు స్టార్ యాంకర్ ఊర మాస్ పిల్ల కూడా ​

ABOUT THE AUTHOR

...view details