తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

SSMB 28లో వైల్డ్​ రోల్​లో జగ్గూ భాయ్​.. తండ్రీకొడుకులుగా షారుక్​! - జవాన్​ సినిమా షారుక్​ ఖాన్​

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు, మాటల మాంత్రికుడు డైరెక్టర్​ త్రివిక్రమ్​ శ్రీనివాస్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా SSMB 28. ఈ సినిమాలో నటిస్తున్న జగపతి బాబు.. తన పాత్ర ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని వెల్లడించారు. మరోవైపు బాలీవుడ్​ బాద్​షా నటిస్తోన్న 'జవాన్​' మూవీ నుంచి కూడా ఓ తాజా అప్డేట్​ వచ్చింది. ఆ వివరాలు..

jagapathi babu comments on his role in ssmb 28 and shah rukh khan to play double role in jawan
SSMB 28 సినిమాలో రోల్​పై జగబతి బాబు కామెంట్స్ జవాన్ సినిమాలో షారుక్​ ఖాన్​ డ్యుయల్​ రోల్​

By

Published : Apr 30, 2023, 4:39 PM IST

కొన్నేళ్ల ముందు వరకు తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్​కు దగ్గరైన స్టార్​ హీరో జగపతి బాబు.. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాల్లో విలన్​ పాత్రలు పోషిస్తున్నారు. ప్రతినాయకులకు ఏ మాత్రం తీసిపోకుండా ఆ క్యారెక్టర్లలో ఒదిగిపోయి నెగటివ్​ రోల్స్​​కు కేరాఫ్​ అడ్రస్​గా మారారు. అయితే సూపర్​స్టార్ మహేశ్​ బాబు, దర్శకుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ కలయికలో వస్తున్న SSMB 28 సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపారు జగపతి బాబు. ఇప్పటికే మహేశ్‌ హీరోగా వచ్చిన రెండు సినిమాల్లో ఆయన కీలకపాత్రల్లో కనిపించారు. మరోసారి దీంతో వీరిద్దరీ మధ్య ఉన్న బాండింగ్ SSMB 28కు ప్లస్​గా నిలవనుందా అని ఆడియన్స్​ చర్చించుకుంటున్నారు.

"త్రివిక్రమ్‌ శ్రీనివాస్​ నా కోసం ఎంతో గొప్ప పాత్రలు సృష్టిస్తారు. ఎక్కువ నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్స్‌ను క్రియేట్​ చేస్తారు. గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' మూవీలో ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటించాను. ఇప్పుడు దానికంటే కొత్తగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాం. అందుకే SSMB 28లో నా క్యారెక్టర్‌ ఆ పాత్ర కంటే వైల్డ్‌గా.. భయంకరంగా ఉండబోతోంది. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు దానిని కచ్చితంగా ఇష్టపడతారు"

-జగపతి బాబు, నటుడు

మరోవైపు రెబల్​ స్టార్​ ప్రభాస్‌ హీరోగా వస్తున్న 'సలార్‌'లోనూ జగపతిబాబు నటిస్తున్నారు. 'ప్రభాస్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. భారీ యాక్షన్‌ చిత్రంగా రానున్న ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా' అంటూ ఈ సినిమా గురించి కూడా మాట్లాడారు జగపతి బాబు. ఇవే కాకుండా హీరో అల్లు అర్జున్‌ 'పుష్ప2'తో పాటు కన్నడలోనూ ఓ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌లోనూ మూడు ప్రాజెక్ట్‌లను ఓకే చేశారు.

'జవాన్'​లో షారుక్​ డబుల్​ రోల్​..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ​ కాంబినేషన్​లో వస్తున్న తాజా చిత్రం 'జవాన్​'. దీనికి సంబంధించి ఓ తాజా అప్డేట్​ వచ్చింది. అదేంటంటే.. ఇందులో షారుక్​ ద్విపాత్రాభినయం చేయనున్నారట. దీనికి ప్రేరణ 'ఒరు కైధియన్​ డైరీ' సినిమాలో నటించిన దిగ్గజ నటుడు కమల్ హాసనే అని సమాచారం. దర్శకుడు అట్లీ.. కమల్ హాసన్​కు పెద్ద అభిమాని కావడం వల్ల ఆయన ఈ సినిమాలో కమల్​ ఒక్కరే పోషించిన తండ్రి, కొడుకుల పాత్రలను షారుక్​తో చేయించాలని ఫిక్స్​ అయ్యారు. దీనిని ప్రేరణగా తీసుకొని 'జవాన్​'లోనూ షారుక్​తో డబుల్​ రోల్స్​ చేయించనున్నారట.

అయితే 'ఒరు కైధియన్​ డైరీ' సినిమాలో కమల్​ హాసన్​ డబుల్​ రోల్​ చేయటానికి 1986లో వచ్చిన బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ నటించిన 'ఆఖ్రీ రాస్తా' చిత్రమే ప్రేరణ. ఎందుకంటే ఇందులో అమితాబ్​ కూడా డ్యుయల్​ రోల్​లో యాక్ట్​ చేశారు. మొత్తంగా కమల్​ చిత్రానికి అమితాబ్​ ప్రేరణగా నిలిస్తే.. షారుక్​ సినిమాకి కమల్​ హాసన్​ ప్రేరణగా నిలిచారన్నమాట.

ఇకపోతే జవాన్​ అనేది క్లాసికల్​ చిత్రమా.. లేదా పేరుకు తగ్గట్టుగా సైనికులకు ఇచ్చే గౌరవం అన్న థీమ్​లో నిర్మిస్తున్నారా అన్న విషయం రాబోయే టీజర్లలోనే తెలియనుంది. ఎందుకంటే 1980ల నేపథ్యంలో రూపొందుతున్న జవాన్​కి సంబంధించి చిత్రబృందం నుంచి మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక వివరణ రాలేదు. ఇక ఈ చిత్రాన్ని జూన్ 2న ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్​ చేస్తున్నారు మేకర్స్​.

ABOUT THE AUTHOR

...view details