తెలంగాణ

telangana

మనీలాండరింగ్​ కేసులో.. బాలీవుడ్​ స్టార్​ నటికి ఊరట

Jacqueline Fernandez: మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​కు కోర్టులో ఊరట లభించింది. అబుదాబిలో జరిగే ఐఫా అవార్డ్సు ఫంక్షన్​లో ఆమె పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

By

Published : May 29, 2022, 4:02 AM IST

Published : May 29, 2022, 4:02 AM IST

jacqueline
jacqueline

Money Landering Case Jacqueline Fernandez: వ్యాపారవేత్త సుకేశ్​ చంద్రశేఖర్​కు సంబంధించి మనీలాండరింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట లభించింది. మే 31 నుంచి జూన్​ 6 వరకు అబుదాబిలో జరిగే ఐఫా అవార్డుల వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. 15 రోజులపాటు అబుదాబి, నేపాల్‌, ఫ్రాన్స్‌ సహా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జాక్వెలిన్‌ దిల్లీ కోర్టును ఆశ్రయించింది. అయితే అబుదాబి వెళ్లేందుకు ఏడురోజుల అనుమతి మంజూరు చేసిన కోర్టు.. నేపాల్‌, ఫ్రాన్స్‌ పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించింది.

ఇదీ కేసు..రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్​ చంద్రశేఖర్​. శివిందర్​ సింగ్​ భార్య అదితి సింగ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్​ సన్నిహితుడు లీనా మరియా పాల్​ సహా.. బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను ఈడీ ప్రశ్నించింది. తిహాడ్​ జైలు నుంచే కాలర్​ ఐడీ స్పూఫింగ్​ ద్వారా జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను సుకేశ్​ చంద్రశేఖర్ సంప్రదించినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వర్గాలు తెలిపాయి. తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతడిని జాక్వెలిన్​ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుకేశ్​కు సంబంధించిన 20కిపైగా కాల్​ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూ.200 కోట్ల దోపిడీ కేసులో దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుకేశ్​ చంద్రశేఖర్​, లీనా పాల్​పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్​ కేసులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details