తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కారు, ల్యాండ్, ఇల్లు.. అన్నీ సెట్! త్వరలోనే 'విచిత్ర' పెళ్లి!! చిరుతో కలిసి.. - ఎక్స్​ట్రా జబర్దస్త్​

మనిషి చూడటానికి పొట్టిగా ఉన్నా 'జబర్దస్త్'​ పంచ్​లు విసిరి పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడు నరేశ్​. జబర్దస్త్​లో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఆ షోలోని ముఖ్య ఆర్టిస్టులలో ఒకరిగా మారిన నరేశ్ తన వ్యక్తిగత జీవితం, కెరీర్​ మొదలైన విషయాలను ఈటీవీ భారత్​కు ఇచ్చిన స్పెషల్​ ఇంటర్వ్యూలో తెలిపాడు. అవేంటో అతని మాటల్లోనే తెలుసుకుందాం.

d
d

By

Published : Jun 12, 2022, 8:19 AM IST

Updated : Jun 13, 2022, 2:03 PM IST

జబర్దస్త్​ నరేశ్​

జబర్దస్త్​ నరేశ్​.. చాలా తక్కువ కాలంలోనే తన కామెడీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తన హావభావాలతో జబర్దస్త్​లో ఎన్నో స్కిట్లను హిట్​ చేయించిన నరేశ్​.. నవ్వించడానికి ఒడ్డూ పొడవుతో సంబంధం లేదని నిరూపించాడు. తనుకున్న హైట్​ సమస్యనే ప్లస్​ చేసుకుని జబర్దస్త్​గా దూసుకెళ్తున్నాడు. కామెడీ టైమింగ్​, పంచ్​లతో బుల్లితెర ప్రేక్షకులకు కితకితలు పెడుతున్నాడు. స్టార్​గా ఎదిగిన ఈ కమెడియన్​.. తన లైఫ్​, కెరీర్​ గురించి ఏమంటున్నాడంటే..

"కెరీర్​ మొదట్లో ఎలా ఉన్నాను.. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాను అనేది గుర్తుంచుకుంటాను. నేను ఇంకా పైస్థాయికి ఎదగాలి.. అలాగే మన షోని మనం కాపాడుకోవాలని అనుకుంటుంటాను. జబర్దస్త్​లో ప్రయాణం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఓ కారు, ఇల్లు కొనుక్కోవాలని కోరిక. ఇప్పటికే కారు కొనేశాను, ల్యాండ్​ కొన్నాను.. త్వరలోనే ఇల్లు కూడా కట్టుకుంటాను. 90 శాతం ఈ ఏడాదే అయిపోతుంది. లేదంటే వచ్చే ఏడాదిలో గృహప్రవేశం చేస్తాను."

- నరేశ్​

అది విచిత్రమే: తనకు పెళ్లంటూ జరిగితే అది పెద్ద విచిత్రమే అవుతుందని అంటున్నాడు నరేశ్. ఒకవేళ జరిగితే మొత్తం జబర్దస్త్​ ఫ్యామిలీ అంతా తన ఇంట్లో ఉంటుందని.. ఇంకో డబుల్​ త్రిబుల్​ జబర్దస్త్​ ఏమైనా వస్తోందా అనేంత హడావుడి ఉంటుందన్నాడు. అయితే ముందు ఇల్లు కట్టుకోవడం పూర్తయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పాడు. ఈ విషయంపై ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదని.. అంతా తన ఇష్టమే అని అన్నాడు.

కల నెరవేరింది: మెగాస్టార్​ చిరంజీవితో స్క్రీన్ షేర్​ చేసుకోవడం తన జీవితంలో సాధించిన అతిపెద్ద విజయం అని అంటున్నాడు నరేశ్​. "చిరంజీవిగారితో చేయడం నా డ్రీమ్​. ఆయన్ను ఒక్కసారైనా కలవాలని అందరికీ ఉంటుంది. అలాంటిది ఆయన తన భోళాశంకర్​ సినిమాలో నరేశ్​ని పెట్టుకోండి అని చిత్రబృందానికి చెప్పి అవకాశం ఇప్పించడం నా జీవితంలో పెద్ద అచీవ్​మెంట్​. షూటింగ్​ సమయంలో నాతో సరదాగా మాట్లాడారు. చాలా సంతోషం అనిపించింది. రెండు రోజులు ఆయనతో షూటింగ్​లో పాల్గొన్నాను. ఆయనను కలవడమే డ్రీమ్​ అంటే.. నేను స్క్రీన్ ​కూడా షేర్​ చేసుకున్నాను." అని సంతోషం వ్యక్తం చేశాడు. దాదాపు పదేళ్ల నుంచి ప్రజలు తనను ఆదరిస్తున్నారని.. తనను, జబర్దస్త్​ను భవిష్యత్తులో మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాడు నరేశ్.

ఇదీ చూడండి :అసలు పెళ్లే వద్దనుకున్నాడు.. ఇప్పుడు ఆమెతో పీకల్లోతు ప్రేమలో.. ఆ ఒక్క ఇంటర్వ్యూతో..

Last Updated : Jun 13, 2022, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details