రోహిణి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం సీరియళ్లు, సినిమాలు, టీవీ షోలతో తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటోంది. ముఖ్యంగా 'జబర్దస్త్'లో చేయడం మొదలు పెట్టాక.. రోహిణి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. జబర్దస్త్‌లో తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తోంది రోహిణి. తన వాయిస్కే ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారని చెబుతున్న ఆమె.. 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడింది.
జబర్దస్త్‌లోకి వచ్చిన మొదట్లో రోహిణి చాలా భయపడిందట. అంతకుముందు లేడీ గెటప్ వేసిన పురుషులను చూస్తే.. ప్రేక్షకులు నవ్వేవారు. అయితే నేరుగా ఆడవాళ్లు.. లేడీ పాత్ర పోషిస్తే.. ప్రేక్షకులు నవ్వుతారా? అని భయపడిందట. కానీ సెట్లోకి అడుగుపెట్టాక.. ఆ అనుమానాలను పటాపంచలు చేసి.. తనకంటూ ఒక స్టైల్‌ను ఏర్పరుచుకొని.. నవ్విస్తోంది రోహిణి.
జబర్దస్త్‌లో రోహిణిపై వేసే పంచులు బాగా పేలుతుంటాయి. ముఖ్యంగా ఆమె లావుగా ఉండడంపై వేసే పంచులు బాగా వర్కవుట్ అవుతుంటాయి. 'బాడీ షేమింగ్' పంచ్‌లపై రోహిణి స్పందించింది. కొన్ని స్కిట్స్‌లో రోహిణి అమ్మ కూడా.. ఆమెపై పంచ్‌లు వేసింది. ఈ క్రమంలో తన అమ్మ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది రోహిణి. ' నన్ను స్కిట్ కోసం తీసుకొచ్చి.. నీ మీద డైలాగ్‌లు వేయిస్తారు' అని తన అమ్మ చెప్పినట్లుగా రోహిణి పేర్కొంది.
"ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా లావుగా ఉండటంపై పలు రకాల బూతులు తిట్టుకుంటాం. అప్పుడు తప్పు అనిపించదు. స్కిట్లో బాడీ షేమింగ్ విషయం వచ్చే సరికి ఫీలవుతుంటారు. బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని జోక్‌గానే తీసుకోవాలి. ప్రేక్షకులు నవ్వుతారు అనుకున్నప్పుడు.. నా మీద ఎలాంటి డైలాగ్ వేసినా.. పట్టించుకోను."