ఫైమా.. పటాస్ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్‌తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. బుల్లెట్ భాస్కర్, ఇమ్మాన్యుయెల్ చేసే స్కిట్లలో పాల్గొని తనదైన శైలి కామెడీ టైమింగ్‌తో వీక్షకులను కితకితలు పెట్టిస్తోంది. చాలా తక్కువ కాలంలో జబర్దస్త్‌లోని పాపులర్ ఆర్టిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది. అయితే ఈ ప్రయాణం వెనుక ఆమె అసలు లక్ష్యం వేరే ఉందట. ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, జబర్దస్త్‌లో తన ప్రయాణం మొదలైన విషయాలపై ఈటీవీ భారత్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
బీడీ అమ్మిన డబ్బులతోనే:తన తల్లి.. తమకు ఏం కావాలన్నా బీడీలు చుట్టి.. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతోనే కొనేదని చెప్పుకొచ్చింది ఫైమా. తాము మంచి పేరు సంపాదించాలని ఆమె ఆకాంక్షించేదని చెప్పింది. చిన్న వయసులోనే అక్కాచెళ్లెళ్లకు పెళ్లి అయిపోయిందని పేర్కొంది.
"మేం నలుగురు అక్కాచెళ్లెలం.. చిన్నప్పటి నుంచి మాకు ఏదైనా కావాలంటే అమ్మ బీడీలు చుట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మాకు కొనిచ్చేది. మాలో ముగ్గురికి పెళ్లిళ్లు కూడా చేసేసింది. మంచిపేరు తెచ్చుకోండి అని చెప్తూ ఉండేది. మంచి పేరు అంటే ఎలా తీసుకొస్తారో నాకు తెలిసేది కాదు. కానీ మల్లెమాల ద్వారా నేను మంచి పేరు తీసుకొచ్చాను.. అలా అమ్మ కల నెరవేరింది."