తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'జబర్దస్త్ విషయంలో ఆ తప్పు చేశా.. నా రెమ్యునరేషన్ తెలియగానే వారంతా షాక్!' - జబర్దస్త్​ తాగుబోతు

Jabardast Tagubotu ramesh: పెద్దగా పంచ్​ డైలాగులు లేకుండానే.. కేవలం హావభావాలతోనే పొట్టచెక్కలయ్యేలా నవ్వించగలడు. ఓ తాగబోతు పాత్ర నుంచి ఇంత హాస్యం పండిచొచ్చా అనేలా తన నటనతో ఆకట్టుకున్నాడు. అతడే తాగబోతు రమేశ్. అటు సినిమాలు చేస్తూనే ఇటు జబర్దస్త్​లో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులకు డబుల్​ ఫన్​ని అందిస్తున్నాడు. అయితే జబర్దస్త్​ విషయం ఓ తప్పు చేశాడట రమేశ్. అదేంటో అతని మాటల్లోనే తెలుసుకుందాం.

jabardast tagubotu ramesh
జబర్దస్త్​ తాగుబోతు రమేశ్​

By

Published : Jun 15, 2022, 9:02 AM IST

జబర్దస్త్​ తాగుబోతు రమేశ్​

Jabardast Tagubotu ramesh: 'అబ్బా తమ్ముడు '... సినీ, బుల్లితెర ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకస్థానం సంపాదించిన డైలాగ్​ ఇది. తన నటన, కామెడీ ​టైమింగ్​తో 'తాగుబోతు'గా రమేశ్​ వేసిన ముద్ర అలాంటింది మరి. మందుబాబు పాత్రల్లో మెప్పిస్తూ తాగబోతు రమేశ్​గా పాపులర్​ అయిన ఈ కమెడియన్​.. ఈ మధ్య మళ్లీ జబర్దస్త్​లో వరుస స్కిట్లు చేస్తూ అదరగొడుతున్నాడు. మరోవైపు సినిమాల్లో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన అతడు.. 'జబర్దస్త్'​లోకి ఎంట్రీ ఇవ్వడం, తన సినీ ప్రయాణం మొదలైన విషయాలను గురించి తెలిపాడు.

"జబర్దస్త్​ మొదలైనప్పటి నుంచి ఆ షో గురించి నాకు తెలుసు. అప్పుడు వేణు, ధన్​రాజ్​, చంటితో పాటు నన్నూ అడిగేవారు. కానీ అప్పుడే 'అలా మొదలైంది' రిలీజై వరుస ఆఫర్లు రావడం వల్ల నాకు కుదరలేదు. చాలా బిజీ ఉన్నా. రెండేళ్లకోసారి బ్యాచ్​లు మారినప్పుడు, ఎక్స్​ట్రా జబర్దస్త్​ పెట్టినప్పుడు కూడా మళ్లీ పిలిచారు. కానీ నాకు కుదిరేది కాదు. నిజానికి చేయడం ఇష్టం లేదు. అంటే టీవీకి వెళ్లకూడదు అని కాదు. అంతకుముందు 'మా' టీవీలో బ్యాండ్​మేలం అనే షో చేశాను. ఒక్కరోజు డేట్​ ఇస్తే రూ.మూడు వేలు ఇచ్చేవారు. అప్పుడు చాలా ఎక్కువ. నాకు రెమ్యునరేషన్​ విని ఆశ్చర్యపోయేవారు! అలా సినిమాలు రాకముందు టీవీ షో చేశా."

-తాగబోతు రమేశ్

అలా ఎంట్రీ: "చంద్ర ప్లేస్​లో నేను జబర్దస్త్​లోకి వచ్చాను. అతను వెళ్లిపోయాడు అంటే అతని స్థానంలో సెలబ్రిటీలను పిలిచి స్కిట్​ చేయించేవారు. కానీ అది టెలికాస్ట్​ కాలేదు. డైరెక్టర్​ని అడిగితే.. టీఆర్​పీ ఆధారంగా షోను టెలికాస్ట్​ చేస్తాము అన్నారు. అయితే అప్పటికే తాగుబోతు రమేశ్​ అని ముద్రపడింది. ఎప్పుడు ఒకటే పాత్ర చేయడం ఎందుకులే అనిపించింది. అందుకే జబర్దస్త్​లోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ షో ప్రసారమయ్యాక చాలా మంది ఫోన్​ చేసి అభినందించారు. మంచి పేరు వచ్చింది. ఇక టీవీ ఆడియన్స్​కు కూడా దగ్గర అవొచ్చనే ఉద్దేశంతో స్కిట్లు చేయడం కొనసాగించా." అని రమేశ్​ అన్నాడు.

అందుకు ఫీలవుతున్నాను..: జబర్దస్త్​కు తాను మొదట్లో నో చెప్పినందుకు ఇప్పుడు ఫీలవుతున్నాను అని అన్నాడు రమేశ్. ముందే వచ్చి ఉంటే కమర్షియల్​గా ఇంకా సక్సెస్​ అయ్యేవాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇలా స్కిట్లు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నాడు. " మొదట్లో నో చెప్పినందుకు చాలా ఫీలవుతున్నాను. ముందే వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ సక్సెస్​ అయ్యేవాడినేమో. ఏ విషయమైనా టైం మీదనే ఆధారపడి ఉంటుంది. తాగబోతుగా నాకు టైం వచ్చింది బీజీగా ఉన్నా. కొన్ని సందర్భాల్లో గ్యాప్​ వస్తుంది. ఆ విరామం​లో టీవీకి వచ్చాను. వివిధ పాత్రలు చేశా. ఓ సారి యాంకర్​ సుమ రోల్​ చేశా. శ్రీదేవి డ్రామాలో చేశాను. ఇక్కడ నా జూనియర్స్​తో పాటు కలిసి చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. " అని రమేశ్​ పేర్కొన్నాడు.

ఇక్కడే ఎక్కువ కష్టం.. "సినిమా అంటే.. రెండు మూడు నెలల ముందే కథ చర్చ జరుగుతుంది. లొకేషన్​కు రాగానే పేపర్​ ఇస్తారు. అందులోని డైలాగులు చదువుకుని నటించాలి. ఈ టీవీ షోల్లో అలా కాదు. మనమే స్క్రిప్ట్​లు, పంచ్​లు తయారు చేసుకుని చేయాలి. సినిమాలతో పోలిస్తే ఎక్కువ కష్టపడాలి. అంతే పేరు కూడా వస్తుంది. అప్పట్లో థియేటర్​కి వెళ్లి నవ్వుకునే రోజుల్లో.. టీవీ ద్వారా కూడా కడుపుబ్బా నవ్వుకోవచ్చని జబర్దస్త్​ నిరూపించింది. ఈ షోను ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నా" అని రమేశ్​ చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి: గతజన్మలో అక్కడే పుట్టానేమో!: సాయిపల్లవి

ABOUT THE AUTHOR

...view details