హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో జబర్దస్త్ ఫేమస్ నరసింహమూర్తి అలియాస్ మూర్తి అనారోగ్య కారణంతో మృతి చెందారు. స్వగ్రామం నాగారంలో పార్థివ దేహానికి జబర్దస్త్ కమెడియన్ వెంకీ పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. రేపు(సెప్టెంబరు 28) నాగారం గ్రామంలో క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
జబర్దస్త్ కమెడియన్ కన్నుమూత.. ఆ సమస్యతో! - అనారోగ్య సమస్యలతో జబర్దస్త్ మూర్తి కన్నుమూత
అనారోగ్య సమస్యలతో జబర్దస్త్ ఫేమస్ నరసింహమూర్తి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ నటులు సంతాపం తెలుపుతున్నారు.
జబర్దస్త్ నటుడు మూర్తి కన్నుమూత
కాగా, గతంలో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా అనేక వందల స్టేజ్ షోలు చేసి మంచి పేరు సంపాదించిన మూర్తి ఆ తర్వాత జబర్దస్త్‌లో కమెడియన్‌గా మారి అనేక స్కిట్లలో అలరించారు. గత కొంతకాలంగా ఆయన పాంక్రియాస్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ అనారోగ్యం వలన చాలా కాలం క్రితం నుంచి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడిన ఆయన స్నేహితులు, సన్నిహితుల ఆర్థిక సాయంతో కాస్త కోలుకున్నారు. కానీ తాజాగా ఆ సమస్యతోనే కన్నుమూశారు.
ఇదీ చూడండి: God Father: మరో పవర్ఫుల్ సాంగ్ రిలీజ్.. చిరు యాక్షన్ సూపర్