తెలుగునాట యాంకర్‌గా బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై మెరుస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది రష్మి. అయితే తాజాగా ఆమె రెమ్యునరేషన్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశాడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. ఆ సంగుతులు..
తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో కంటెస్టెంట్లంతా రెండు టీమ్‌లుగా విడిపోయి ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటూ సందడి చేశారు. బుల్లెట్ భాస్కర్, ఇమ్మాన్యుయెల్, రాకింగ్ రాకేశ్ ఓ గ్యాంగ్‌గా మారి క్రికెట్ బ్యాట్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. 'మా ఎక్స్ట్రా జబర్దస్త్‌లో ఇద్దరు అబ్బాయిలను ఇక్కడి ఇద్దరు అమ్మాయిలు వలలో వేసుకున్నారు. వారిని వదిలేయండి' అంటూ ఇమ్మాన్యుయెల్ కామెడీ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రెండో టీమ్ ఆది, రాకెట్ రాఘవ హాకీ స్టిక్స్‌తో వచ్చి ఆపోజిట్ గ్యాంగ్‌పై పంచ్ డైలాగ్‌లు వేస్తూ కితకితలు పెట్టించారు.