తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బర్త్​డే ముందు వర్షకు అదిరిపోయే సర్​ప్రైజ్.. కాస్ట్లీ గిఫ్ట్​ ఇచ్చిన ఇమ్మూ! - వర్ష ఇమ్మాన్యుయెల్ రిలేషన్ షిప్​

ఇమ్మాన్యుయెల్​.. తమ కాబోయే పార్ట్నర్ వర్షకు అదిరిపోయే సర్​ప్రైజ్​ ఇచ్చాడు. ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చాడు.

Immanuel costly gift to varsh
వర్షకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మాన్యుయెల్​

By

Published : Nov 8, 2022, 10:09 AM IST

Updated : Nov 8, 2022, 10:25 AM IST

'జబర్దస్త్' ఇమ్మాన్యుయేల్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు వర్ష. ఎందుకంటే అంతలా ఈ జోడీ తమ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. అయితే కొద్ది రోజులుగా వీరి మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు వచ్చాయి. అయితే అది నిజమైనప్పటికీ మళ్లీ వీరిద్దరూ కలిసిపోయారు. ఈ క్రమంలోనే అతడు వర్షకు ఓ అదిరిపోయే బహుమతి కూడా ప్రెజెంట్​ చేశాడు.

వచ్చే నెల వర్ష పుట్టినరోజు ఉంది. అంతకంటే ముందే ఆమెని ఇమ్ము.. హైదరాబాద్​లోని ఓ సిల్వర్​ జ్యువెలరీ షోరూమ్​కు షాపింగ్​కు తీసుకెళ్లి సర్​ప్రైజ్ చేశాడు. ఆ మొత్తాన్ని వీడియో తీసి యూట్యూబ్​లో పోస్ట్ చేశాడు. అయితే ఈ వ్లాగ్ అంతా కూడా చాలా ఫన్నీగా సాగింది. ఇక వర్షకి నెక్లెస్​ను బహుమతిగా ఇచ్చాడు ఇమ్ము. అలానే తనపై జోకులు, సెటైర్లు వేస్తూ తెగ నవ్వించాడు. 'గోల్డ్ ఇస్తే ఎక్కువవుతుందని ఇక్కడికి తీసుకొచ్చావా?' అని వర్ష అడగ్గా.. 'నువ్వే గోల్డ్​ రా' అంటూ తెగ నవ్వులు పూయించాడు. కాగా, రీసెంట్​గా ఓ లగ్జరీ కారు కొన్న ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు వర్షకు అదిరిపోయే సరప్రైజ్​ గిఫ్ట్ ఇవ్వడం చూసి నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇమ్ము ఫుల్ జోష్​లో ఉన్నాడని అంటున్నారు.

హార్ట్​ఫీల్​ పెర్​ఫార్మెన్స్​.. కాగా, తాజాగా ప్రసారమైన శ్రీదేవీ డ్రామా కంపెనీలో.. వర్షతో మనస్పర్థలు రావడంపై స్పందించాడు ఇమ్మూ. దూరంగా ఉంటుందని నిజమేనంటూ.. పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశాడు​. స్యాడ్​ లవ్​ సాంగ్స్​ పాడి తనలోని బాధను బయటపెట్టాడు. ఇందులో ఇమ్యాన్యుయెల్​ హార్ట్​ఫీల్​ పెర్​ఫార్మెన్స్ అదిరిపోయింది. నాలుగు ప్రేమ విషాద గీతాలు ఆలపించాడు. ఘర్షణలోని 'చెలియా చెలియా', నా ఆటోగ్రాఫ్​లోని 'నువ్వంటే ప్రాణమని' అంటూ వర్షను ఉద్దేశించి విషాద పాటలను పాడాడు. ఇమ్మూ పాట పాడుతున్నంత సేపు వర్ష కూడా ఎంతో బాధతో కనిపించింది. ఇమ్మూ పాడటం, వర్ష బాధపడటం సన్నివేశాలు హృదయాన్ని హత్తుకున్నాయి. ఇక చివరికి ఒకరినొకరు తమకున్న ప్రేమను తెలియజేసుకుని కలిసిపోయారు.

ఇకపోతే.. స్టాండప్ కమెడియన్​గా కెరీర్ ప్రారంభించి 'జబర్దస్త్'లో కమెడియన్​గా సెటిలయ్యాడు ఇమ్మాన్యుయెల్​. ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తున్నాడు. సీరియల్స్​లో నటిస్తూ 'జబర్దస్త్'లోకి ఎంట్రీ ఇచ్చి లేడీ కమెడియన్​గా క్రేజ్​ సంపాదించుకుంది వర్ష. వీరిద్దరు మొదట్లో కెవ్వు కార్తీక్ టీమ్​లో స్క్రిట్​లు చేసి అలరించారు. అలా వీరి జర్నీ ప్రేమగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు!

ఇదీ చూడండి:వర్షతో మనస్పర్థలు.. హార్ట్​ టచింగ్​ సాంగ్స్​తో చెక్​ పెట్టిన ఇమ్మూ.. పెర్​ఫార్మెన్స్​ సూపర్​

Last Updated : Nov 8, 2022, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details