తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బడా డైరెక్టర్​తో సుధీర్ భారీ బడ్జెట్ సినిమా! విలన్​గా స్టార్ హీరోయిన్? - sudigali sudheer upcoming movies

'సాఫ్ట్​వేర్ సుధీర్', 'త్రీ మంకీస్', 'వాటెండ్ పండుగాడు', 'గాలోడు' వంటి సినిమాల్లో నటించి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సుడిగాలి సుధీర్​ ఇప్పుడు ఓ బడా డెైరెక్టర్​తో సినిమా చేయనున్నాడట. భారీ బడ్జెట్​తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట.

sudigaali sudheer
sudigaali sudheer

By

Published : Apr 20, 2023, 7:31 AM IST

Updated : Apr 20, 2023, 10:24 AM IST

బుల్లితెర స్టార్​ యాంకర్​ సుధీర్​ ప్రస్తుతం టీవీతో పాటు సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. జబర్దస్త్‌లో తన కామెడీ టైమింగ్స్​తో కితకితలు పెట్టే ఈ స్టార్​..వెండితెరపై వెలుగొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. సపోర్టింగ్​ రోల్స్​ చేస్తూ సినీ ఆడియన్స్​కు సుపరిచితుడయ్యాడు. 'సాఫ్ట్​వేర్ సుధీర్', 'త్రీ మంకీస్', 'వాటెండ్ పండుగాడు', 'గాలోడు' వంటి సినిమాల్లో హీరోగా వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయినప్పటికీ సుధీర్​కు టీవీలో ఉన్న పాపులారిటీ బిగ్​స్క్రీన్​పై రాలేకపోయింది.

ఓ కమెడియన్​గా రాణించి ఆ తర్వాత హీరోగా మారి సక్సెస్ సాధించాలంటే అది మామూలు విషయం కాదు. అయితే సుడిగాలి సుధీర్‌ మాత్రం తన స్కిట్స్​తో బుల్లితెరపై తిరుగులేని స్టార్​గా ఎదిగినప్పటికీ.. అదే క్రేజ్‌ను వెండితెర వరకు తీసుకుని రాలేకపోయాడు. అయినప్పటికీ వెనుతిరగని సుధీర్​.. ఈ సారి బడా ప్లాన్​తో రంగంలోకి దిగుతున్నాడు. ఇంతకు ముందు చిన్న చిన్న దర్శకులతో సినిమాలు చేసిన ఈయన. ఇప్పుడు బడా డైరెక్టర్​ను లైన్​లో పెట్టాడు.

ఇంతకీ ఆ డైరెక్టర్​ ఎవరో కాదు.. దర్శకుడు దశరథ్. సంతోషం, మిస్టర్​ పర్ఫెక్ట్​ లాంటి హిట్​ సినిమాలు తీసిన ఈయన త్వరలో సుడిగాలి సుధీర్ ఓ సినిమాకు సైన్​ చేయనున్నారని సమచారం. క్లాసిక్ హిట్లకు పేరొందిన దశరథ్.. గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. 2016లో మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన 'శౌర్య' సినిమా‌నే ఆయన చివరిది. అయితే ఆ సినిమా కూడా దశరథ్‌కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో ఆయన కమ్​బ్యాక్ ఇచ్చేందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. సుడిగాలి సుధీర్​తో సినిమాకు ఓకే చెప్పినట్టు టాక్​.

ఇక సుధీర్‌కు కూడా ఈ స్టోరీ నచ్చిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన కూడా సినిమాలో నటించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా సుధీర్ కెరియర్‌లోనే కాస్త ఎక్కువ బడ్జెట్‌తో రూపొందనుందట. సుధీర్​ సరసన ఈ సినిమాలో పూజిత పొన్నాడ నటించనుందట. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించనుందని సినీ వర్గాల టాక్. ఇందులో ట్విస్ట్​ ఏంటంటే.. ఈ సినిమాలో లేడీ విలన్​గా ఒకప్పటి స్టార్ హీరోయిన్​ను తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై ఎటువంటి అధికారిక సమాచారం అయితే వెలువడలేదు. నిజంగానే సుధీర్-దశరథ్ సినిమా సెట్స్​ పైకి వెళ్లనుందా లేదా అన్ని ఇంకా తెలియాల్సి ఉంది.

Last Updated : Apr 20, 2023, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details