తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అది నా కష్టార్జితం దాంతో అతడికి సంబంధం లేదు, మరి ఆ హీరోయిన్ సంగతేంటి - jacqueline case

సినిమా పరిశ్రమలో సంచలనం రేపిన 200 కోట్ల రూపాయల మనీలాండిరింగ్​ కేసులో తనను నిందితురాలిగా ఈడీ పరిగణించడంపై బాలీవుడ్ నటి జాక్వెలిన్​ స్పందించారు. ఈడీ దర్యాప్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసి తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. ఆ డబ్బును తాను కష్టపడి సంపాదించానని, అది నేరాల ద్వారా వచ్చిన సొమ్ము కాదని ఆమె వెల్లడించారు.

Jacqueline
Jacqueline

By

Published : Aug 25, 2022, 12:21 PM IST

Jacqueline Fernandez: సుకేశ్‌ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మోసపూరిత వసూళ్ల కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఇటీవల ఈడీ నిందితురాలిగా పరిగణించింది. కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్‌ చేశారు. వీటిల్లో రూ.7 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. అయితే, ఆ డబ్బును తాను కష్టపడి సంపాదించానని, అది నేరాల ద్వారా వచ్చిన సొమ్ము కాదని ఆమె వెల్లడించారు.

తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గురించి పీఎంఎల్‌ఏ అధికారులకు జాక్వెలిన్‌ సమాధానమిచ్చారు. తనకు సుకేశ్ పరిచయం కాకుముందే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశానన్నారు. ఈ ఆదాయం చట్టబద్ధమైందని, దానిపై పన్ను కూడా చెల్లించానని ఆమె చెప్పారు. "కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో పనిచేస్తూ నేను కష్టపడి సంపాదించిన డబ్బు అది. సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉన్నాడని తెలీక ముందే దానిని సంపాదించాను. ఆ సొమ్మును వాడుకొనే వెలుసుబాటు ఇవ్వండి. ఒక మహిళగా నేను కోల్పోయిన దానిని డబ్బుతో కొలవలేం" అంటూ తనకు జారీ అయిన నోటీసులపై స్పందించారు.

"తాను కేంద్ర దర్యాప్తు బృందానికి విచారణ సమయంలో సహకరించాను. ఈ కేసులో బాధితురాలిని కాదని భావిస్తున్నాను. సుకేష్ రచించిన కుట్రలో బలి పశువును అయ్యాను. నాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే కానీ నాకు తీరని అన్యాయం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు.. వాదనలకు మాత్రమే పరిమితమైంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి జరిపిన విచారణగా భావిస్తున్నాను."

-- జాక్వెలిన్ ఫెర్నాండెజ్​

మరి నోరా ఫతేహి సంగతేంటి?..
"సుకేష్ చంద్రశేఖర్ మాఫియాలో నేను ఒక్కరినే ఆరోపణలు ఎదుర్కోలేదు. నోరా ఫతేహి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఎందరో సినీ తారలకు సుకేష్ విలువైన గిఫ్టులు ఇచ్చాడు. వారిని సాక్షులుగా మాత్రమే పరిగణించారు. కానీ నాపై మాత్రమే నేరారోపణలు చేశారు. దీనిని బట్టి చూస్తే.. నాపై కేసు పెట్టడం వెనుక చాలా కుట్ర ఉందని అనిపిస్తుంది." అని జాక్వెలిన్​ అన్నారు.

దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన డిజైనర్‌ బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌.. ఇలా దాదాపు రూ.10కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్‌, ఆమె కుటుంబ సభ్యులకు సుకేశ్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సుకేశ్‌తో నటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ విచారణలో తేలినట్లు సమాచారం. దాంతో ఈ మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా ఈడీ పరిగణించింది. ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును చేర్చింది. మోసపూరిత వసూళ్ల నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి:విజయ్​ లైగర్​ మూవీ రిలీజ్​, నాగార్జున యాక్షన్‌ సీన్స్​కు ఫ్యాన్స్​ ఫిదా

RC 15 ప్రాజెక్ట్‌పై శంకర్ క్లారిటీ, రెండూ ఒకేసారి జరుగుతాయంటూ

ABOUT THE AUTHOR

...view details