కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఆయన.. రీసెంట్గా 'కస్టడీ' మూవీతో డిజాస్టర్‌ను అందుకున్న వెంకట్ ప్రభుతో ఓ చిత్రం చేయనున్నారు. తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. #thalapathy68 వర్కింగ్ టైటిల్‌తో చిత్రాన్ని ప్రకటించిన వెంకట్ ప్రభు.. 'విజయ్‌తో సినిమా చేయాలనే నా కల నిజమైంది' అంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కళపతి ఎస్. అఘోరం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి యువన్ శంకర్‌రాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. ఇటీవలే రెండు రోజుల క్రితం వచ్చిన ఓ వార్త ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అదేంటంటే విజయ్ దళపతి రెమ్యునరేషన్. 'లియో' తర్వాత చేయబోయే సినిమా కోసం విజయ్‌కు.. ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఏకంగా రూ.200కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందని తెగ వార్తలు వచ్చాయి. అంటే వెంకట్ ప్రభుతో చేయబోయే సినిమాకేనా రూ.200కోట్లు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ రెమ్యునరేషన్ వార్తపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్‌లో విజయ్ దళపతి పెద్ద స్టారే. అక్కడి మిగతా స్టార్ హీరోలు అజిత్, రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు ఉన్న మార్కెట్‌తో సమానంగా ఈయన మార్కెట్ కూడా ఉంటుంది. ఈయన సినిమాలు కూడా భారీ వసూళ్లనే అందుకుంటుంటాయి. అయితే 2021 'మాస్టర్' సినిమా సమయంలో విజయ్ రెమ్యునరేషన్ రూ.80కోట్లు అని వార్తలు వచ్చాయి. అయితే ఇంత తక్కువ సమయంలో విజయ్ డబుల్ ఫిగర్‌ను ఎలా అందుకున్నారనే ప్రశ్న చాలా మంది మెదడలో మెదులుతోంది.
'మాస్టర్' తర్వాత ఆయన 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'కేజీయఫ్'లాగా ఇండియా, వరల్డ్ వైడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ను కూడా అందుకోలేదు. 'బీస్ట్', 'వారిసు' అనే రెండు చిత్రాలు చేశారు. అవి రూ.100 నుంచి రూ.200కోట్ల వరకు వసూళ్లు సాధించి కమర్షియల్ పరంగా హిట్ అయినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. 'మాస్టర్'కు ముందు వచ్చిన 'తేరి', 'భైరవ', 'మెర్సల్', 'సర్కార్', 'బిగిల్'.. ఆ తర్వాత లేటెస్ట్ 'వారసుడు' సినిమాల వరకు అన్నీ రెగ్యులర్ రొటీన్ ఎంటర్‌టైన్‌మెంట్ కథలే. ఇవి కూడా వంద నుంచి రెండు వందల కోట్ల మధ్యలోనే వసూలు చేశాయి! మరి ఇలాంటి వసూళ్లతో ఆయనకు డబుల్ సెంచరీ రెమ్యునరేషన్ ప్రచారం ఏంటనేది సస్పెన్సే.
ఇదీ చూడండి:Bichagadu 2 Collections : జోరు మీదున్న 'బిచ్చగాడు 2'.. రెండో రోజు అదిరిపోయే వసూళ్లు