Acharyas Dharmasthali Set : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పాన్ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కే'లో నటిస్తున్నారు మన డార్లింగ్. వీటితో పాటు దర్శకుడు మారుతీతో ఓ సినిమా పూర్తిచేసే పనిలో ఉన్నారు. అయితే.. ఈ సినిమా సౌత్ వరకే విడుదల కాబోతుందని తెలుస్తోంది.
ఆచార్య 'ధర్మస్థలి' సెట్లో ప్రభాస్- మారుతీ మూవీ షూటింగ్! - ధర్మస్థలి సెట్‌ను ప్రభాస్ సినిమా కోసం వాడుక
మెగస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమాలో ఉపయోగించిన ధర్మస్థలి సెట్‌ను ప్రభాస్ సినిమా కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది.
'రాజా డీలక్స్' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హారర్ కామెడీ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా ఒక సినిమాలో ఉపయోగించిన సెట్స్‌ను మరో సినిమాలో వాడుతుంటారు. ఒకే సెట్ అయినప్పటికీ, సినిమా కంటెంట్‌కు అనుగుణంగా మార్పులు చేస్తుంటారు మేకర్స్. ఈ క్రమంలో ప్రభాస్- మారుతీల సినిమాలో సెట్ విషయంపై ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమాలో ఉపయోగించిన ధర్మస్థలి సెట్‌ను ప్రభాస్ సినిమా కోసం వాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, మేకర్స్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.