తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సినీ కష్టాల్లో బాలీవుడ్ ఖాన్స్!.. మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేనా? - amir khan movies

ఒకప్పుడు బాలీవుడ్​ను ఏలిన షారుక్​ ఖాన్​, ఆమిర్​ ఖాన్​, సల్మాన్​ ఖాన్​ ఇప్పుడు హిట్స్ లేక చతికిలపడ్డారు. వరుసగా పరాజయాలను మూటగట్టకుంటున్నారు. త్వరలో విడుదల కాబోయే తమ తదుపరి సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు.

bollywood khans
bollywood khans

By

Published : Nov 2, 2022, 9:40 PM IST

ఒకప్పుడు బాలీవుడ్ అనగానే ముగ్గురు ఖాన్స్ కళ్ల ముందు కదలాడేవారు. వారు నటించిన సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేవి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఈ ముగ్గురు బీటౌన్​పై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించేవారు. కానీ ఇప్పుడు వారి సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. మంచి హిట్ దొరక్క ఖాన్స్ అవస్థలు పడుతున్నారు. మళ్లీ సక్సెస్ కొట్టి హిట్ ట్రాక్​లోకి వెళ్లేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు.

'జీరో' తర్వాత అంతా జీరో!
షారుక్​ ఖాన్ నాలుగేళ్ల క్రితం 'జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత పూర్తిగా తెరమరుగయ్యాడు. ఈ సినిమా హిట్ కాకపోగా, ఆ తర్వాత కుమారుడి డ్రగ్స్​ వ్యవహారం పెద్ద తలనొప్పులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో సినిమాలకు దూరం అయ్యారు. షారుక్​ 2013లో నటించిన 'చెన్నై ఎక్స్​ప్రెస్' తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా హిట్ అందుకోలేదు.

ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్​ రాజ్‌ ఫిలిమ్స్​ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. షారుక్​, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో 'డుంకి' అనే మరో సినిమా తెరకెక్కుతోంది. వీటితో మళ్లీ హిట్ బాటలోకి అడుగుపెట్టాలని షారుక్​ భావిస్తున్నారు.

'లాల్ సింగ్ చడ్డా'తో కోలుకోలేని దెబ్బ!
ఆమీర్ ఖాన్ పరిస్థితి దారుణంగా ఉంది. 'బాయ్ కాట్' ఉద్యమం దెబ్బకు ఘోరంగా నష్టపోయారు. ఆమీర్ ఖాన్ తాజాగా నటించిన 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమా పరాభవం పాలైంది. ఆమీర్ కెరీర్​లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్​గా నిలిచింది. ఈ సినిమాపై ఆమీర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా, అవన్నీ అడియాశలయ్యాయి. రూ.150 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా అందులో సగం డబ్బులు కూడా వసూలు చేయలేకపోయింది.

బాలీవుడ్ కండల వీరుడి పరిస్థితి అంతంత మాత్రమే!
ఇక సల్మాన్ ఖాన్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. 2015లో వచ్చిన 'భజరంగీ భాయ్ జాన్' తర్వాత పెద్దగా సినిమాలేవీ రాలేదు. 2021లో వచ్చిన 'రాధే' సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం 'కిసికా భాయ్ కిసికా జాన్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల కాబోతుంది. వచ్చే ఏడాది ఈద్​కు 'టైగర్-3' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాల మీదే సల్మాన్ ఆశలు పెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details