Actor Nazar retirement: నాజర్.. సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఇటు దక్షిణాది-అటు ఉత్తరాదిలోనూ హీరో, విలన్, కమెడియన్, సపోర్టింగ్ క్యారెక్టర్‌గా.. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇక ప్రభాస్ 'బాహుబలి'లో బిజ్జల దేవగా ఆయన కనబరిచిన నటనను ఎవ్వరూ మర్చిపోలేరు. అంతలా చెరగని ముద్ర వేశారు.
అయితే ఇప్పుడు ఆయన గురించి ఓ వార్త ఫిల్మ్సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటూ అంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఆయన గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొన్నారని, అప్పుడు వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారట. దీంతో అప్పటినుంచి కుటుంబసభ్యులు సినిమాలకు దూరంగా ఉండి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల ఆయన రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి ఒప్పుకున్న చిత్రాలను త్వరగా పూర్తి చేసి పర్మినెంట్‌గా ఇంటికే పరిమితమవ్వాలని సిద్ధమవుతున్నారని తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే చిత్రపరిశ్రమ ఆయన సేవలను కోల్పయినట్లేనని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నాజర్ ఆరోగ్య త్వరగా బాగు అవ్వాలని ప్రార్థిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రిటైర్మెంట్ విషయంపై క్లారిటీ రావాలంటే ఆయన స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.