Indias Most Successful Actress :సినిమాల్లో హీరోల పాత్ర ఎంత ముఖ్యమో హీరోయిన్లూ కూడా అంతే. తమ గ్లామర్‌తో పాటు యాక్టింగ్ స్కిల్స్‌తో కథానాయికలు.. కథ మొత్తాన్ని నడిపించిన సందర్భాలున్నాయి. ఇక కొన్ని సార్లు హీరోలతో పోలిస్తే వీళ్లు నటించిన చిత్రాలపైనే ప్రేక్షకుల ఫోకస్ ఉంటుంది. కానీ హీరోలతో పోలిస్తే వీళ్లకు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ తారలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ముందుకు సాగుతుంటారు.
అయితే ఓ హీరోయిన్ మాత్రం తన కెరీర్లో ఓ రికార్డు క్రియేట్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్గా కొనసాగుతోంది. బాక్సాఫీస్ వసూళ్లతో రాణిస్తూ.. క్వీన్ అనిపించుకుంది. ఇంతకీ ఆమెవరో కాదు అభిమానులు బెబో అని ముద్దుగా పిలుచుకునే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్.
23 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న ఈ తార.. తన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటి తరం కథానాయికల్లో సుమారు 23 బ్లాక్బస్టర్ల చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా కరీనా టాప్ పొజిషన్లో ఉంది. ఆ తర్వాత ఆమె సోదరి.. కరిష్మా కపూర్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌లు 22 సినిమాలతో సెకెండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక రాణి ముఖర్జీ 21, ప్రియాంక చోప్రా 18, కాజోల్ 14 మూవీస్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.