తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రూ.200కోట్ల వెబ్​సిరీస్- ఇండియాలోనే కాస్ట్లీ- షారుక్ మూవీ బడ్జెట్​ కన్నా ఎక్కువే!

India's Costliest Web Series: ఒక వెబ్ సిరీస్ తీయాలంటే అయ్యే ఖర్చు త‌క్కువే. ఎంత క్వాలిటీగా తీసినా సినిమా బ‌డ్జెట్​ని మించి అయితే అవ్వ‌దు. కానీ ఒక వెబ్​సిరీస్ రూపొందించడానికి మాత్రం రెండు సినిమాల‌ బ‌డ్జెట్ క‌న్నా ఎక్కువే ఖ‌ర్చ‌యింది. ఇంత‌కీ ఏంటా సిరీస్? అందులో ఉన్న ప్ర‌త్యేకత ఏంటంటే?

India's Costliest Web Series
India's Costliest Web Series

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 3:41 PM IST

India's Costliest Web Series: ఈ మ‌ధ్య కాలంలో సినిమాలతోపాటు వెబ్​సిరీస్​, డాక్యుమెంటరీలు చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆడియెన్స్​ను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్, వెబ్​సిరీస్​లు ఎక్కువగానే చేస్తున్నారు.​ ఇక ఓటీటీ ఫ్లాట్​ఫామ్​ల్లో స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఉండడం వల్ల వెబ్​సిరీస్​లపై ప్రేక్షకులు బాగా ఆస‌క్తి చూపుతున్నారు.

ఓటీటీల్లో మ‌న‌కు కావాల్సిన సినిమా/వెబ్​సిరీస్ ఎప్పుడంటే అప్పుడే చూడొచ్చు. అందుకే వీటికి ఆడియెన్స్​లో వీటికి క్రేజ్ ఎక్కువవుతోంది. రోజూ కొత్త సినిమాలు, వెబ్​సిరీస్​లు OTTలో విడుద‌ల‌వుతున్నాయి. కామెడీ, హర్రర్, ఎమోషన్స్, డ్రామా, యాక్షన్​లాంటి జానర్లలో ఈ వెబ్​సిరీస్​లు రూపొందుతున్నాయి. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇప్పటికే అనేక వెబ్​సిరీస్​లు వచ్చాయి.

ఒక క‌థ‌ను ఎపిసోడ్​లుగా విభజించి తీసేదే వెబ్​సిరీస్. అయితే ఈ ఎపిసోడ్​ల రన్​టైమ్​ 15నిమిషాల నుంచి 30నిమిషాల మధ్యలో ఉంటుంది. కథను బట్టి ఈ సమయంలో మార్పు ఉంటుంది. అయితే ఎలాంటి వెబ్​సిరీస్ అయినా రూ.లక్షల్లో ఖర్చుతోనే రూపొందించవచ్చు. కానీ, ఓ బాలీవుడ్​ వెబ్​సిరీస్​​కు మాత్రం రూ.కోట్లు ఖ‌ర్చ‌యింది. అంతే కాదు దాని బ‌డ్జెట్ మొత్తం క‌లిపితే రెండు బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువైంది.

2022లో 'రుద్ర - ది ఏజ్ ఆఫ్ డార్క్‌నెస్' అనే బాలీవుడ్ వెబ్​సిరీస్ విడుదలైంది. ఈ సిరీస్​లో స్టార్ నటుడు అజయ్ దేవ్‌గన్, రాశీ ఖన్నా, ఇషా దేవోల్, అతుల్ కులకర్ణి, అశ్విని కల్సేకర్, ఆశిష్ విద్యార్థి న‌టించారు. డైరెక్టర్​ రాజేష్ మపుస్కర్ సైకలాజికల్ క్రైమ్, డ్రామా మిస్టరీ జానర్​లో ఈ సిరీస్​ను రూపొందించారు. ఇది బ్రిటిష్ షో 'లూథర్'కి హిందీ రీమేక్‌. ఈ సిరీస్ ప్రముఖ సినిమా, వెబ్​సిరీస్ ఇన్ఫర్మేషన్ వెబ్​సైట్​ ఐఎమ్​డీబీ (IMDB)లో 10కి 6.7 రేటింగ్‌ను పొందింది.

అయితే ఈ వెబ్​సిరీస్ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్​తో రూపొందినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన బాలీవుడ్​లో రీసెంట్​గా రిలీజైన సన్నీ దేవోల్ గదర్-2 (రూ.60కోట్లు), షారుక్ ఖాన్ డంకీ (రూ.85కోట్లు), రణబీర్ కపూర్ యానిమల్ (రూ.100కోట్లు) సినిమాల కంటే ఈ వెబ్​సిరీస్​కే ఎక్కువ ఖర్చు అయ్యింది. కాగా, ఈ వెబ్​సిరీస్​ స్ట్రీమింగ్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ దక్కించుకుంది.

OTT లవర్స్​కు​ సరికొత్తగా ETV WIN.. 'ఒక్క రూపాయి'కే బ్లాక్ బాస్టర్​ సినిమాలు, సిరీస్​లు

థియేటర్, ఓటీటీలో ఈ వారం సందడి చేసే చిత్రాలివే!

ABOUT THE AUTHOR

...view details